వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ టార్గెట్: జస్ట్ మిస్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కారుతో ఆయన కాన్వాయ్ మీద దాడి చేశారు. అయితే నవాజ్ షరీఫ్ అదృష్టవశాత్తు తృటిలో తప్పించుకున్నారని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి.

పోలీసు అధికారులు, పాక్ మీడియా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం నవాజ్ షరీఫ్ ఆయన భార్య, కుమార్తెలతో కలిసి కారులో హిల్ ఫామ్ హౌస్ దగ్గర నుండి ఇస్లామాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో ఆయన కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేసుకుంటు ఒక కారు దూసుకు వెళ్లింది.

Pakistan Prime Minister Nawaz Sharif Target

తరువాత నవాజ్ షరీఫ్ కారును బలంగా డీకొనింది. తేరుకున్న సెక్యూరిటి సిబ్బంది, పోలీసు అధికారులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కార తో డీకొన్న వ్యక్తి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ కమాండర్ గా పని చేసి రిటైర్ అయిన హఫీస్-ఉల్- రెహమాన్ అని గుర్తించారు.

అయితే అతను ఎందుకు నవాజ్ షరీఫ్ కారును డీకొన్నాడు అని అధికారులు విచారిస్తున్నారు. గత వారంలో లష్కర్-ఏ-జగ్వీ మిలిటెంట్ మాలిక్ ఇషాక్ ను పోలీసు అధికారులు అంతం చేశారు. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

నవాజ్ షరీఫ్ ఎప్పటిలాగే పూర్తి స్థాయి భద్రతతో కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి ప్రయత్నించారు. నవాజ్ షరీఫ్ భద్రత మరింత కట్టుదిట్టం చేశామని పాకిస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రయాణిస్తున్న కారు నెంబర్ నకిలిది అని విచారణలో వెలుగు చూసింది.

English summary
The car, which apparently attempted to overtake Mr Sharif's convoy, was forced off the road and its driver was taken into custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X