చావును కొనితెచ్చుకోవద్దు: పాకిస్థాన్ కు భారత్ సంచలన వార్నింగ్

భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దారుణం వెనకాల ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఉందని తేలడంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 వరకు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. దాంతోపాటు పాకిస్థాన్ పై అనేక వాణిజ్య.. రవాణా ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల పంపిణీని నిలిపివేసింది. అలాగే ఇరు దేశాల మధ్య ఎయిర్ ట్రావెల్ కూడా రద్దు అయింది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ పై కుట్రలు.. కుతంత్రాలను చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా కీలక వార్నింగ్ ఇచ్చారు.

భవిష్యత్తులో భారత్ పై ఏదైనా ఉగ్రవాద కార్యక్రమం, చర్యలకు పాల్పడితే పాకిస్థాన్ కు గట్టిగా ఊహించని విధంగా బుద్ధి చెప్తామని.. టెర్రరిజం విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం మారిందని దౌత్య చర్చలతో కాదని మిలిటరీ చర్యతోనే ఉగ్రవాదానికి బదులు చెప్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే భారత్ నుంచి భారీ ఎదురుదాడిని పాకిస్థాన్ కొని తెచ్చుకోవద్దని తనదైన శైలిలో రాజ్ నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ తో పాటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ ను టెర్రరిజంపై భారత్ వైఖరికి ఉదాహరణలుగా వివరించారు. ఈ మేరకు దిల్లీలో తాజాగా జరిగిన డిఫెన్స్ కాన్ క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

2014 నుంచి టెర్రరిస్టుల షెల్ఫ్ లైఫ్ సంవత్సరం కంటే తక్కువగా పడిపోయిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. టెర్రరిస్టులు ఆయుధాలు చేతపట్టి భారత్ పై దాడికి యత్నించిన సంవత్సరం లోపే భద్రతా దళాలు వాళ్లను హతమార్చుతున్నాయని స్పష్టం చేశారు. అలాగే ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనను కూడా గుర్తు చేశారు. ఓ కో పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూల్చేయాలని చూడగా మరో పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్.. తన ప్రాణాలను పణంగా పెట్టి భారీ ఉగ్రదాడిని ఎదుర్కున్నాడని ఈ మేరకు ఆయన్ను ప్రశంసించారు. ఈ ఘటన చూస్తే.. జాగ్రత్తగా.. ధైర్యంగా ఉంటే భారీ ప్రమాదాలను నిరోధించవచ్చని తెలుస్తోందని పేర్కొన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే భద్రతా దళాలతోపాటు సామాన్య పౌరులు కూడా అప్పుడప్పుడు నడుం బిగించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

Pakistan regarding the issue of terrorism Union Defence Minister Rajnath Singh issued stern warning

ప్రస్తుతం ఉగ్రవాదం అనేక రూపాలను సంతరించుకుంటోందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు 5డీ సెక్యూరిటీ త్రెట్ ను హైలెట్ చేశారు. డిస్ ఇన్ఫార్మేషన్, డీ స్టేబిలైజేషన్, డిస్రర్ఫన్, డిసెప్షన్, డిస్ట్రక్షన్ అనేవి కీలకంగా మారాయని తెలిపారు. టెర్రరిజం ఆర్గనైజ్డ్ గ్రూప్స్ నుంచి ఒంటరిగా ఎటాక్ లు చేయడం అలాగే వైట్ కాలర్ టెర్రరిజం పెరిగిపోయాయని పేర్కొన్నారు. దాంతో ఉగ్రమూకలను గుర్తించడం సెక్యూరిటీ సిబ్బందికి కష్టతరంగా మారుతోందని స్పష్టం చేశారు. అలాగే రానున్న సవాళ్లను హార్డ్ అండ్ స్మార్ట్ పవర్ తో అధిగమించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+