పాకిస్తాన్‌కు అమెరికా గట్టి షాక్: 40 ఏళ్ల బ్యాంకు క్లోజ్, భారీ ఫైన్

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: దాదాపు 40 ఏళ్లుగా అమెరికాలో నిర్వహిస్తున్న పాకిస్థాన్ హబీబ్ బ్యాంకును అమెరికా బ్యాంకుల నియంత్రణా విభాగం మూసి వేయించింది.

అమెరికాలోని హబీబ్ బ్యాంకు ద్వారా ఉగ్రవాదులకు నిధులు వెళుతున్నాయన్న అనుమానం, అక్రమ నగదు లావాదేవీలపై ఎన్నోమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బ్యాంకుపై 225 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) జరిమానా విధిస్తున్నట్టు న్యూయార్క్ బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

‘Pakistan’s Habib Bank to pay $225-mn New York fine for compliance failures’

పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకుగా ఉన్న హబీబ్ బ్యాంక్, ఫిర్యాదులు, ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం, ఉగ్రవాదానికి ప్రోత్సాహంగా నిలవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) వెల్లడించింది.

ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఆ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి 13వేల లావాదేవీలు జరిగాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఆయుధాల డీలర్లుతో పాటు పలువురు ఈ బ్యాంకు నుంచి ఎటువంటి స్క్రీనింగ్‌ లేకుండా 250మిలియన్‌ డాలర్లు వరకు లావాదేవీలు జరుపుకొనేందుకు అవకాశం ఉంది. వారందరినీ ఈ బ్యాంకు గుడ్‌ గై జాబితాగా పేర్కొంది.

నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన న్యూయార్క్‌ హబీబ్‌ బ్యాంకు లైసెన్సును తిరిగి ఇచ్చేందుకు ఆ బ్యాంకు అంగీకరించినట్లు డీఎఫ్‌ఎస్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

కాగా, 1978లో హబీబ్ తొలి శాఖ ఆమెరికాలో ప్రారంభమైంది. ఈ బ్యాంకు నుంచి సౌదీ ప్రయివేట్ బ్యాంక్, అల్ రజాహీ బ్యాంక్ వంటి అల్ ఖైదా ఉగ్రవాదులతో లావాదేవీలు జరిపే బ్యాంకులకు బిలియన్ల కొద్దీ డాలర్లు వెళ్లాయని తేలినట్టు డీఎఫ్ఎస్ అధికారి మారియా ఉల్లో వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The New York State Department of Financial Services on Thursday said Pakistan’s Habib Bank had agreed to pay $225 million to settle an enforcement action brought against it for infringing laws designed to combat illicit money transfers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X