పాకిస్థాన్ కు షాకులే షాకులు.. ఇంటర్నెట్ లో పాక్ రాయబారి అశ్లీల వీడియోలు.. అమ్మాయితో ఆ పనిచేస్తూ..?
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ లోని పాకిస్థాన్ రాయబారికి సంబంధించి అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటికొచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది.
బంగ్లాదేశ్ లోని పాకిస్థాన్ హై కమిషనర్ గా ఉన్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ కొత్త వివాదంలోకి చిక్కారు. ఆయన హనీ ట్రాప్ లో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన శృంగారం జరిపిన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అహ్మద్ మరూఫ్ మే 11 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సెలవుపై వెళ్లారని.. పరారీలో లేరని బంగ్లాదేశ్ లోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పాక్ రాయబారి అహ్మద్ మరూఫ్.. బంగ్లాదేశ్ కు చెందిన ఆ అమ్మాయితో కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నట్లు నిఘా వర్గాల ద్వారా బంగ్లాదేశ్ కు తెలిసింది. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని సమాచారం. అహ్మద్ మరూఫ్ ఆ అమ్మాయి.. వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు దిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ అధికారికి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతడ్ని 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications