ఆ దేశానికి పాకిస్థాన్ లక్ష టన్నుల బియ్యం ఎగుమతి..
పాకిస్థాన్- బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్.. పాకిస్థాన్ కు లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. ఈ మేరకు ది ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్(TCP) షిప్పింగ్ కు సంబంధించి గతవారం టెండర్ జారీ చేసింది. ఇరు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో బియ్యం ఎగుమతికి సంబంధించి చర్చలు జరిగిన నేపథ్యంలో మొదటి బ్యాచ్ లో భాగంగా 50,000 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దిగిపోయాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడినట్లు స్పష్టం అవుతోంది.
పాకిస్థాన్.. బంగ్లాదేశ్ కు లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దిగిపోయాక ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత దృఢంగా మారినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు పాకిస్థాన్ కు చెందిన ది ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (TCP) టెండర్ జారీ చేసింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ కు అతిపెద్ద బియ్యం ఎగుమతి ఇదే కావడం గమనార్హం. అయితే ఫస్ట్ బ్యాచ్ లో భాగంగా 50,000 టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది ప్రథమార్థంలో ఎగుమతి చేసింది పాకిస్థాన్.
షేక్ హసీనా తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని చూస్తున్నట్లు ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ కు దాదాపు 2 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత అక్టోబర్ లో బంగ్లాదేశ్ రాజధాని ధాకాలో జాయింట్ ఎకనామిక్ సదస్సు నిర్వహించిన బంగ్లాదేశ్- పాకిస్థాన్ లు అనేక కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కూడా జరిగాయి.

భారత్ తో వైరం నేపథ్యంలో భారత్ కు సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, చైనాలతో పాకిస్థాన్ మైత్రి నడుపుతోంది. అటు చైనాతోనూ సత్సంబంధాలు పెంచుకుంటోంది. ఇటీవల అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.












Click it and Unblock the Notifications