వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: భారత్‌పై అణు దాడి తప్పదు: హెచ్చరించిన పాక్ విదేశాంగ మంత్రి ఆసిఫ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పాక్ హెచ్చరించింది. పాక్ విదేశాంగశాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా భారత్‌పై తీవ్ర ఆరోఫణలు చేశారు.

పాక్‌కు షాక్: జనవరి 18,19 తేదిల్లో అగ్ని- 5 టెస్ట్‌కు ఇండియా రెఢీపాక్‌కు షాక్: జనవరి 18,19 తేదిల్లో అగ్ని- 5 టెస్ట్‌కు ఇండియా రెఢీ

భారత ఆర్మీ చీఫ్ రెండు రోజుల క్రితం పాక్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా మండిపడింది. ఆదివారం నాడు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఆసిఫ్ ఈ మేరకు భారత్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

నిబంధనలకు విరుద్దంగా పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆరోపణలు చేశారుఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది.

భారత్ పై అణఉదాడి తప్పదు

భారత్ పై అణఉదాడి తప్పదు

భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పేర్కొంది. పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌ ఈ మేరకు తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

 భారత్ కవ్వింపు చర్య

భారత్ కవ్వింపు చర్య

ఇండియన్‌ ఆర్మీ చీప్‌ భాద్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కవ్వింపు చర్యనే. అణుక్షిపణుల దాడికి భారత్‌ మాకు ఆహ్వానం పంపుతున్నట్లుంది. ఒకవేళ వారు యుద్ధానికి కాలుదువ్వితే అందుకు మేం కూడా సిద్ధమేనని ఆసిఫ్ తేల్చి చెప్పారు. భారత్‌పై అణుదాడి తీవ్ర స్థాయిలో చేసి తీరతామన్నారు.

 రావత్ అనుమానాలను తీరుస్తాం

రావత్ అనుమానాలను తీరుస్తాం

భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అనుమానాలను త్వరలోనే తీరుస్తామని ఆసిప్ చెప్పారు.మరోవైపు విదేశాంగ ప్రతినిధి ఫైసల్‌ కూడా రావత్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఇక రావత్‌ దిగజారి మాట్లాడారని నిఘా వ్యవస్థ ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గుఫర్‌ మండిపడ్డారు.

టెన్షన్... టెన్షన్

టెన్షన్... టెన్షన్

రెండు దేశాల మధ్య తాజా ఆరోఫణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆర్మీ డే సందర్భంగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పాకిస్థాన్ కూడ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది. పాక్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.ఈ రెండు దేశాల మధ్య సంబంధాలపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

English summary
The Pakistan Army on Saturday warned India against any misadventure, asserting that the country's nuclear weapons were exclusively meant to foil any threat emanating from the east.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X