వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదం: సొంత మిలటరీని కడిగేసిన పాక్ అమ్మాయి

|
Google Oneindia TeluguNews

కరాచీ: యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ దాడుల తర్వాత పాకిస్తాన్ - భారత దేశాల మధ్య, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పాక్ అన్నింటా ఏకాకి అయింది. ఈ నేపథ్యంలో సొంత దేశంలోని పత్రికలే ప్రధాని నవాజ్ షరీఫ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తీవ్రవాదం పట్ల మన తీరే ప్రపంచంలో ఏకాకిని చేస్తోందని స్థానిక పత్రికలు కథనాలు కూడా ఇచ్చాయి. మరో యువతి కూడా పాక్‌ను కడిగి పారేశారు. ఆమె పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి కావడం గమనార్హం.

పీవోకేలో భారత్ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో యుద్ధం తప్పదేమోనని అందరూ భావించారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉందనేది ఎవరూ కాదనే సత్యం.

ఉగ్రవాదులకు పాకిస్తాన్ మిలిటరీ నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయి. ఉగ్రవాదులకు పాక్ మిలటరీ సహకారం పైన సదరు పాకిస్తాన్ యువతి ఆర్మీని కడిగి పారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఆ వీడియోలో ఆమె తీవ్రవాదంలో మిలటరీ పాత్ర అనే అంశంపై మాట్లాడారు. ఇందులో ఆమె పాక్ మిలటరీని తూర్పారబట్టారు. ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు.

దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై నిలదీశారు. అవినీతి రాజకీయ నాయకుల పైన తీవ్రంగా మండిపడింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆమెను చూసి అందరూ అవాక్కయ్యారు. ఆమె ప్రసంగానికి ముగ్ధులయ్యారు.

English summary
A video featuring a young Pakistani girl asking some tough questions on the role of military in growing terrorism has now become viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X