నో యూ టర్న్స్.. నో కర్వ్స్: వేల కిలోమీటర్ల హైవే- అడ్వెంచర్ ట్రావెలర్స్ కు స్వర్గధామం

ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొత్తం 14 దేశాల గుండా వెళుతుందీ రోడ్. ఈ రహదారిపై 30,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి మలుపులు ఉండవు. యూటర్నులూ కనిపించివు. అదే దీని ప్రత్యేకత.

ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి రహదారులు ఎంతో అవసరం. ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు దేశానికి పురోగతిని, అభివృద్ధిని కలిగిస్తాయి. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో రహదారుల నెట్‌వర్క్ విస్తరించి ఉంది. భారత్ లో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిర్మించిన ఎన్ హెచ్ 44 అత్యంత పొడవైనది. దీని పొడవు 3,745 కిలోమీటర్లు ఉత్తరం దక్షిణాలను కలుపుతుందీ హైవే.

మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే రహదారి ఒక్క దేశం గుండా కాకుండా 14 దేశాల గుండా వెళుతుంది. ఈ రహదారిపై ప్రయాణించడం ఓ సాహసంగా చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ ట్రావెలర్స్ కు స్వర్గధామంగా ఉంటుందిది.

ప్రపంచంలోనే పొడవైన రహదారి

ప్రపంచంలోనే పొడవైన రహదారిగా పాన్-అమెరికన్ హైవే పేరుగాంచింది. పాన్-అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన హైవే. దీని పొడవు కారణంగా ఈ హైవే పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఉత్తర అమెరికా నుండి ప్రారంభమై 14 దేశాలను దాటుకుంటూ ఈ హైవే దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా వరకు వెళుతుంది. దట్టమైన అడవులు, ఎడారులు, మంచు మైదానాలు, పర్వతాల గుండా వెళ్ళే ఈ హైవే ప్రపంచంలోనే పొడవైన రహదారిగా పేరుగాంచింది.

14 దేశాలను కలుపుతూ..

1923లో ఈ హైవేను ఉత్తర అమెరికా, మధ్య- దక్షిణ అమెరికా రాష్ట్రాలను కలపడానికి నిర్మించారు. పాన్-అమెరికన్ హైవే మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వెడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టారికా, ఉత్తర అమెరికాలోని పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ మరియు అర్జెంటీనా మీదుగా దక్షిణ అమెరికాకు చేరుకుంటుంది. 30,000 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేపై వాహనాలను నడిపించడం అంత సులభం కాదు.

మలుపులు లేని మార్గం

ఈ హైవేపై 30,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి మలుపులు ఉండవు. అంటే ఒకసారి ఈ హైవేపైకి ఎక్కితే నెలల తరబడి ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 60 రోజులు పడుతుంది. ఈ హైవేపై ప్రయాణించేవారు రోజుల తరబడికి అవసరమైన సరుకు- సరంజామాలతో బయలుదేరుతారు.

దారిలో భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ప్రజలకు 60 రోజుల సమయం పడుతుంది. ఇది పూర్తిగా మన వాహనం వేగంపై ఆధారపడి ఉంటుంది. కాలోరస్ సాంటాన్‌మారియా అనే వ్యక్తి ఈ మార్గాన్ని 117 రోజుల్లో పూర్తి చేశాడు.

అడుగడుగునా సవాళ్లే

ఈ హైవే వెళుతున్నట్లయితే కొన్ని నెలలపాటు సరిపడా సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. బండి చెడిపోయిందంటే అంతే సంగతులు. మెకానిక్ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వాహనానికి అవసరమైన టూల్స్ వెంట ఉంచుకోవడం మంచిది. దీనివల్ల ఎక్కడైనా కారు పంచర్ అయితే మీరే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చు.

అనేక ప్రదేశాలలో ఫ్యూయల్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 14 దేశాల గుండా వెళ్ళే ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు భిన్న రకాల వాతావరణాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వాతావరణానికి తగ్గట్టుగా మీ దుస్తులను సిద్ధం చేసుకోండి. పాన్-అమెరికన్ హైవేపై డేరియన్ గ్యాప్ అనే ప్రమాదకరమైన భాగం ఉంది.

అడ్వెంచర్ ట్రావెలర్స్ కు..

ఈ హైవేపై ప్రయాణం చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ హైవేపై వాహనం నడిపే వ్యక్తి అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. దారిలో అడవులు, పర్వతాలు, ఎడారులు, హిమానీనదాలు మొదలైన అన్ని ప్రదేశాల గుండా వెళ్లవలసి ఉంటుంది.

పాన్ అమెరికన్ హైవేపై ప్రయాణం ఎంతో సాహసోపేతమైనది. వివిధ దేశాల గుండా వెళ్తూ భిన్న సంస్కృతులను, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+