36వేల అడుగుల ఎత్తులో ఫ్లైట్ ! కాక్ పిట్ లోకి దూసుకొచ్చి, పైలట్ కు రక్తం కారేలా..!
అమెరికాలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 36 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ బోయింగ్ విమానం కాక్ పిట్ లోకి హఠాత్తుగా ఓ అదృశ్య వస్తువు దూసుకొచ్చింది. పైలట్లు దాన్ని గమనించే లోపే అది విమానం కాక్ పిట్ ముందు భాగంలో ఉండే విండ్ షీల్డ్ ను దెబ్బతీసింది. దీంతో ఒక్కసారిగా విమానంలో పైలట్లతో పాటు ప్రయాణికులు కూడా షాకయ్యారు. చివరికి తేరుకుని విమానాన్ని పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
అచ్చం హాలీవుడ్ సినిమా తరహాలో అమెరికాలోని డెన్వర్ నుంచి లాస్ ఏంజెల్స్ కు ప్రయాణిస్తున్న ఓ విమానానికి అనూహ్య ఘటన ఎదురైంది. 36 వేల అడుగుల ఎత్తులో ప్రశాంతంగా ప్రయాణిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానానికి ఎదురుగా ఓ అదృశ్య వస్తువు ఎగురుతూ వచ్చింది. పైలట్లు దాన్ని గమనించే లోపే అది విండ్ షీల్డ్ పగులగొట్టుకుని మరీ కాక్ పిట్ లోకి దూసుకుని వచ్చేసింది. దీంతో ఈ విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒకరు గాయపడ్డారు.

ఇదంతా జరుగతున్న సమయంలో సదరు బోయింగ్ విమానంలో 134 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ అదృశ్యవస్తువ దాడి కారణంగా పైలట్ చేతులకు గాయాలు అయి రక్తం కారుతున్న ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. డ్యాష్‌బోర్డ్, కాక్‌పిట్‌పై పగిలిన గాజు ముక్కలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వస్తువు ఢీకొన్న ప్రదేశంలో కాలిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటనకు గల కారణాల గురించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వివరాలు బయటపెట్టలేదు.

✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️✈️
— kayvan sabouri (@KayvanSabouri) October 20, 2025
A United Airlines Boeing B737 MAX pilot was injured after the aircraft’s windshield cracked at 36,000 feet while flying from Denver (DEN) to Los Angeles (LAX) on Thursday, 16 October 2025. Initial reports suggest the damage may have been caused by falling… pic.twitter.com/RlCBl8NtfO
ఈ అనూహ్య ఘటనకు కారణమేమిటో ఇంకా తేలలేదు. అంతరిక్ష శిథిలాలు వాణిజ్య విమాన ప్రయాణీకుడికి గాయాలు కలిగించే అవకాశం చాలా అరుదు అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.పక్షులు, వడగళ్ళు, ఇతర వస్తువులు తక్కువ ఎత్తులో విమానాలను ఢీకొనే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన చూస్తే వాటికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ బోయింగ్ విమానం 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీంతో ఆ అదృశ్య వస్తువు గురించి అధ్యయనం చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications