టెహ్రాన్ లో పేలుడు..? షాకింగ్ వీడియో.. 5 వేల సమాధులు సిద్ధం..!
అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని పరంద్ ప్రాంతంలో దట్టమైన పొగ కనిపించింది. దాంతో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఏదైనా పేలుడు సంభవించి ఉండొచ్చని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్షిపణులు లేదా డ్రోన్ దాడి వల్ల ఈ పేలుడు సంభవించిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇరానియన్ స్టేట్ బ్రాడ్ కాస్టర్ IRIB ఈ వార్తలను కొట్టిపారేసింది.
పరంద్ ప్రాంతంలోని పొదల్లో జరిగిన చిన్న అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ.. ఆ ప్రాంతంలోని భవనాలను అలుముకుందని IRIB పేర్కొంది. అలాగే పరంద్ లో ఎలాంటి పేలుడు జరగలేదని స్థానిక అధికారులు సైతం స్పష్టం చేశారు. ఈ సీజన్ లో పరంద్ ప్రాంతంలో ఇలాంటి కార్చిచ్చులు సహజంగానే జరుగుతుంటాయని తెలిపారు.
ఇక జెనీవా వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ కొన్ని గంటల పాటు హార్మోజ్ జలసంధిని మూసి వేసింది. అంతేకాక ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక చర్యలు చేపట్టింది. లైవ్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు అదే ప్రాంతంలో అమెరికా కూడా సైన్యాన్ని మోహరిస్తోంది. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది.
MASSIVE EXPLOSION HITS IRAN MILITARY WAREHOUSES #breakingnews #iran #tehran #explosion #military #geopolitics #worldnews #defensenews #conflict #newsupdate pic.twitter.com/z01W8S7UuC
— DefenceMedia (@Defencemedia0) February 18, 2026
Five thousand graves have been prepared for the U.S. soldiers on the outskirts of Tehran
— Tehran Times (@TehranTimes79) February 18, 2026
The CEO of Beheshte Zahraa, Tehran's largest cemetery, said that a seperate location was needed because U.S. soldiers cannot be buried in a Muslim cemetery. pic.twitter.com/7tClBnSF9m
ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ లోని పరంద్ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో ఇది ఇరాన్ పై అమెరికా సైన్యం దాడిగా నెట్టింట వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు ఇరాన్ మీడియా, స్థానిక అధికారులు కొట్టిపారేశారు. అయినా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పరంద్ ప్రాసిక్యూటర్ తాజాగా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే అమెరికా సైనికుల మృతదేహాలను పూడ్చేందుకు ఐదు వేల సమాధులను ఇరాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్ శివారులో ఇందుకోసం కాంక్రీట్ తో సెపరేట్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టెహ్రాన్ లోని అతి పెద్ద శ్మశాన వాటిక అయిన బెహెస్తే జహ్రా సీఈఓ మాట్లాడుతూ.. అమెరికా సైనికుల్ని ముస్లి శ్మశాన వాటికలో పూడ్చలేం కాబట్టి సెపరేట్ గా 5 వేల సమాధులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
-
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి.. -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది?












Click it and Unblock the Notifications