షాక్: పోర్న్ చూసేందుకు పార్లమెంటు సిబ్బంది అమితాసక్తి!

Subscribe to Oneindia Telugu

లండన్‌: ఇంగ్లాండ్ పార్లమెంటులో కొంతమంది సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. పార్లమెంటు సిబ్బందే ఏకంగా అశ్లీల చిత్రాలు చూసేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

వీడు మామూలోడు కాదు!?: ఏకంగా 8పెళ్లిళ్లు, రూ.4.5కోట్లు కాజేశాడు

ఈ క్రమంలోనే పార్లమెంటులో ఉన్న కంప్యూటర్ల నుంచి తమకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని దాదాపు 24,473 విన్నపాలు వచ్చినట్లు బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ వెల్లడించడం సంచలనంగా మారింది.

 అశ్లీలమే కావాలంటూ..

అశ్లీలమే కావాలంటూ..

ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఫ్‌ఓఐ) పేరిట బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ ఈ సమాచారం సేకరించింది. గత జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్‌లు వచ్చినట్లు వెల్లడించింది.

 ప్రధాని ఆగ్రహం..

ప్రధాని ఆగ్రహం..

వెస్ట్‌మినిస్టర్‌లో ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రధాని థెరీసా మే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఆదేశించారు.

మంత్రినే తొలగించారు..

మంత్రినే తొలగించారు..

ఈ కారణంతోనే థెరీసా మే తన స్నేహితుడైనా క్షమించకుండా మంత్రి డామియన్‌ గ్రీన్‌ను గత ఏడాది తొలగించారు. ఆయన కంప్యూటర్లలో అశ్లీల వీడియోలు లభించినప్పటికీ పోలీసులను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించారు.

 ప్రభుత్వ పెద్దల నుంచే..

ప్రభుత్వ పెద్దల నుంచే..

కాగా, తనపై ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమని గ్రీన్ పేర్కొన్నారు. అయితే, తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం చాలామంది ప్రభుత్వ పెద్దలు తమ కంప్యూటర్ల నుంచి అశ్లీల వీడియోల కోసం (24వేల)విన్నపాలు పంపిస్తున్నట్లు తేలడం గమనార్హం. 2016లో కూడా ఇలాంటి విన్నపాలు వచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Staff working in Parliament tried to access online pornography once every nine minutes in the last couple of months, despite a crackdown on inappropriate sexual behaviour, new figures show.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి