Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాలు ఇవే..!

ప్రస్తుతం ఏ దేశంలో చూసినా యుద్ధం, ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఒక దేశంలో ఉద్రిక్తతలు సద్దుమణిగేలోపు మరో దేశంలో ప్రారంభం అవుతున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచంలో సురక్షితమైన దేశాలు ఉన్నాయా..? అనే అనుమానం వస్తుంది. అయితే తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే సురక్షితమైన దేశాలు, నగరాల వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా మిడిల్ ఈస్ట్ లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఆఖరికి సురక్షిత ప్రాంతాలుగా భావించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబి, దుబాయ్ వంటి నగరాలను సైతం ఈ యుద్ధం తాకింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక కార్యకలాపాలు ఇరాన్ లోపల పలు వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపైన అలాగే అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలపై పలువురు దృష్టి సారిస్తున్నారు. అయితే తాజాగా నుంబియో సంస్థ రూపొందించిన ప్రపంచంలో అత్యంత సురక్షితమైన పది నగరాల జాబితా వివరాలు చూస్తే.. 1. క్వింగ్‌ దావో, షాన్డాంగ్, చైనా 2. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3. దోహా, ఖతార్ 4. షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6. తైపీ, తైవాన్ 7. మనామా, బహ్రెయిన్ 8. మస్కట్, ఒమన్ 9. ది హేగ్, నెదర్లాండ్స్ 10. ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్ ఉన్నాయి.

ఇక ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన 10 దేశాల జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేకపోవడం గమనార్హం. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 10 అత్యంత సురక్షితమైన దేశాల జాబితా చూస్తే.. ఐస్‌ ల్యాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో ఐర్లాండ్ రెండో స్థానంలో ఉంది. అలాగే న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశాలు అంతర్జాతీయంగా శాంతిభద్రతలకు ప్రమాణంగా నిలుస్తున్నాయి.

PeacefulCountries Top 10 Most in the World 2026 Safest amp amp Calmest Nations Ranked latest ranks

ఇక ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. అలాగే సింగపూర్ ఆరో స్థానంలో నిలిచింది. పోర్చుగల్, డెన్మార్క్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు స్లోవేనియా తొమ్మిదో స్థానంలో, ఫిన్ ల్యాండ్ పదో స్థానంలో చోటు సంపాదించాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాలుగా గుర్తింపు పొందాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+