9 బెడ్‌రూంలు: ఒబామా ఉండబోయే భవంతి ఇదే (ఫోటోలు)

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జులై చివరి నాటికి ఆ దేశ అధ్యక్ష బరిలో ఎవరు నిల్చోబోతున్నారో కూడా తెలిసిపోనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా పదవీ కాలం వచ్చే జనవరిలో ముగియనుంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో శ్వేత సౌధంలో ఉంటున్న ఒబామా తన పదవీ కాలం ముగిన తర్వాత ఆయన నివసించేందుకు కొత్త ఇంటిని సిద్ధం చేశారు. వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న భవంతిని అధికారులు సిద్ధం చేశారు. 1928లో ఈ భవంతిని నిర్మించారు.

ఈ భవంతిలోనే బరాక్ ఒబామా ఉండబోతున్నారని అమరికా మీడియా కూడా నిర్ధారించింది. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గదులు, అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మించిన ఈ ఇంటి విలువ రూ.40 కోట్లకు పైమాటే.

అయితే ఒబామా ఈ ఇంట్లో కేవలం అద్దెకు మాత్రమే ఉంటారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్‌మెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఒబామా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల పాటు తన కుటుంబం వాషింగ్టన్ లోనే ఉంటుందని చెప్పారు. ఒబామా చిన్న కుమార్తె షాషా ప్రస్తుతం స్కూలింగ్ మధ్యలో ఉండటమే ఇందుకు కారణం.

 పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జులై చివరి నాటికి ఆ దేశ అధ్యక్ష బరిలో ఎవరు నిల్చోబోతున్నారో కూడా తెలిసిపోనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా పదవీ కాలం వచ్చే జనవరిలో ముగియనుంది.

 పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో శ్వేత సౌధంలో ఉంటున్న ఒబామా తన పదవీ కాలం ముగిన తర్వాత ఆయన నివసించేందుకు కొత్త ఇంటిని సిద్ధం చేశారు. వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో కలోరమా ప్రాంతంలోని తొమ్మిది పడక గదులున్న భవంతిని అధికారులు సిద్ధం చేశారు. 1928లో ఈ భవంతిని నిర్మించారు.

 పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

ఈ భవంతిలోనే బరాక్ ఒబామా ఉండబోతున్నారని అమరికా మీడియా కూడా నిర్ధారించింది. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన గదులు, అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మించిన ఈ ఇంటి విలువ రూ.40 కోట్లకు పైమాటే.

పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

పదవీ కాలం ముగిశాక ఒబామా ఉండబోయే భవంతి ఇదే

అయితే ఒబామా ఈ ఇంట్లో కేవలం అద్దెకు మాత్రమే ఉంటారు. కాగా ఒబామాకు చికాగోలో సొంత అపార్ట్‌మెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఒబామా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల పాటు తన కుటుంబం వాషింగ్టన్ లోనే ఉంటుందని చెప్పారు. ఒబామా చిన్న కుమార్తె షాషా ప్రస్తుతం స్కూలింగ్ మధ్యలో ఉండటమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+