వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సులు, ఫ్యామిలీ ఉద్వేగం: బంపర్ ఆఫర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/హైదరాబాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న 46మంది భారతీయ నర్సులు ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం ఇక్కడికి చేరుకున్నారు. దీంతో నెల రోజులుగా కొనసాగుతున్న వారి కష్టాలకు తెరపడినట్టయ్యింది.

మరో 137మంది కూడా ఉన్న ప్రత్యేక విమానం ఉదయం 11 గంటల 57 నిమిషాలకు విమానాశ్రయంలో దిగినట్టు కోచ్చి విమానాశ్రయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. నర్సులందరూ క్షేమంగా విడుదలయ్యేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేసిన కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. మరోవైపు ఇరాక్ నుండి ఏపీకి చెందిన వారు కూడా శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

కాగా, ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపి భారత్ తిరిగి వచ్చిన 46 మంది నర్సులకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఉపాధి కోల్పోయిన వీరికి తాను ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ఎన్ఎంసీ హెల్త్ కేర్ గ్రూప్ సీఈవో బీఆర్ శెట్టి తెలిపారు. దుబాయ్‌లో వీరు నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. బీఆర్ శెట్టికి దుబాయ్, ఈజిప్టు, భారత్‌లో ఆసుపత్రులు ఉన్నాయి.

నర్సులు

నర్సులు

ఇరాక్ నుండి వచ్చిన నర్సుల్లో 45మంది కేరళకు చెందిన వారు కాగా, ఒకరు తమిళనాడులోని టూటికోరన్‌కు చెందిన వారు. క్షేమంగా తిరిగొచ్చిన తమ ఆత్మీయులను చూడటం కోసం నర్సుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చారు.

నర్సులు

నర్సులు

తమ వాళ్లంతా క్షేమంగా తిరిగి వచ్చినందుకు వారి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కూడా విమానాశ్రయానికి వచ్చారు.

నర్సులు

నర్సులు

ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ సొంత పట్టణమైన తిక్రిత్‌లోని ఒక ఆస్పత్రిలో పని చేస్తున్న ఈ నర్సుల కష్టాలు గత నెల 9న ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్, సిరియా( ఐఎస్‌ఐఎస్) మిలిటెంట్లు ఆ ప్రాంతంపై దాడులు చేయడం ప్రారంభించినప్పటి నుంచి మొదలయ్యాయి.

నర్సులు

నర్సులు

నర్సులందరినీ క్షేమంగా విడిచిపెట్టేలా చూడటానికి భారతీయ అధికారులు ఇరాక్ అధికారులతో నిరంతరం సమాలోచనలు జరుపుతున్నప్పటికీ, గురువారం మిలిటెంట్లు వారిని బలవంతంగా అక్కడినుంచి తరలించి తమ అధీనంలో ఉన్న మోసుల్‌లో నిర్బంధంలో ఉంచారు. వీరిని విడిపించడానికి విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

నర్సులు

నర్సులు

చివరికి మిలిటెంట్లు బందీలను విడిచిపెట్టి బస్సుల్లో ఎర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం తరలించారు.
శనివారం ఉదయం ఎర్బిల్ విమానాశ్రయంనుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడం, కేటరింగ్ సప్లైల కోసం ముంబయి విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. విమానంలో నర్సులే కాకుండా కిర్కుక్‌కు చెందిన 70మందితో పాటుగా 137మంది ఇతర భారతీయులు, 23మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వాధికార్లు ఉన్నారు. ప్రభుత్వ అధికారుల్లో జాయింట్ సెక్రటరీ స్థాయి ఐఎఫ్‌ఎస్ అధికారితో పాటు కేరళ ప్రభుత్వానికి చెందిన మహిళా ఐఏఎస్ అధికారి ఉన్నారు.

నర్సులు

నర్సులు

ఇరాక్ నుంచి తమ రాష్ట్రానికి చెందిన నర్సులు క్షేమంగా తిరిగి వచ్చేందుకు కృషి చేసిన కేంద్రానికి, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు, ఇరాక్‌లోని భారత దౌత్యకార్యాలయానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి ఊమన్ చాందీ కృతజ్ఞతలు తెలిపారు.

తమిళ నర్సు

తమిళ నర్సు

ఇరాక్ నుండి వచ్చిన నర్సుల్లో 45మంది కేరళకు చెందిన వారు కాగా, ఒకరు తమిళనాడులోని టూటికోరన్‌కు చెందిన వారు. క్షేమంగా తిరిగొచ్చిన తమ ఆత్మీయులను చూడటం కోసం నర్సుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చారు.

నర్సు

నర్సు

కేరళ ప్రభుత్వం ఆందోళనను కేంద్రం పూర్తిగా అర్థం చేసుకుందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ నర్సులను విడిపించడానికి చిత్తశుద్ధితో కృషి చేశాయని ఊమన్ చాందీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

శంషాబాద్

శంషాబాద్

ఇరాక్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో బారత ప్రభుత్వం చేయూత నిచ్చి అక్కడున్న నర్సులను, ఇతర కార్మికులను మన దేశం తీసుకు వచ్చింది. శంషాబాద్ చేరుకున్న పలువురి దృశ్యం. బాధితులు వస్తున్నారని తెలిసి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపినాథ్.

శంషాబాద్

శంషాబాద్

ఇరాక్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో బారత ప్రభుత్వం చేయూత నిచ్చి అక్కడున్న నర్సులను, ఇతర కార్మికులను మన దేశం తీసుకు వచ్చింది. శంషాబాద్ చేరుకున్న పలువురు బాధితులు.

శంషాబాద్

శంషాబాద్

ఇరాక్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో బారత ప్రభుత్వం చేయూత నిచ్చి అక్కడున్న నర్సులను, ఇతర కార్మికులను మన దేశం తీసుకు వచ్చింది. శంషాబాద్ చేరుకున్న పలువురు బాధితులు.

English summary
Photos of Migrants who arrived safely in Hyderabad from Iraq.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X