మోడీతో సుందర్ పిచాయ్ భేటీ-భారత్ లో ఏఐకి గూగుల్ సాయం..!
మోడీ ఫ్రాన్స్ పర్యటనలో కృత్రిమ మేథపై ఏర్పాటు చేసిన యాక్షన్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని మోడీని అనంతరం అక్కడికి వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కలుసుకున్నారు. ఏఐ ద్వారా భారత్ కు ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయో ప్రధాని మోడీకి ఆయన వివరించారు. ఏఐ రాక వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన అవసరం లేదంటూ ఈ సదస్సులో మోడీ చెప్పిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ తో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు హాజరైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఏఐతో భారత్ కు ఎలాంటి మేలు జరగబోతోందో ప్రధాని మోడీకి వివరించారు. అనంతరం మోడీతో జరిగిన భేటీపై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. ఇందులో మోడీతో చర్చించిన అంశాల్ని పంచుకున్నారు. వీటిలో ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఇవాళ ప్యారిస్‌లో ఉన్నప్పుడు ప్రధాని మోడీని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతదేశానికి ఏఐ తీసుకొచ్చే అద్భుతమైన అవకాశాల గురించి , భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనపై కలిసి పనిచేసే మార్గాలపై చర్చించినట్లు గూగుల్ సీఈవో పిచాయ్ తెలిపారు.

Delighted to meet with PM @narendramodi today while in Paris for the AI Action Summit. We discussed the incredible opportunities AI will bring to India and ways we can work closely together on India’s digital transformation pic.twitter.com/OXA3vfQ6OT
— Sundar Pichai (@sundarpichai) February 11, 2025
అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయిన ప్రధాని మోడీ.. ఆయనతోనే కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు కో-ఛైర్‌గా వ్యవహరించారు. అనంతరం ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ప్రసంగించిన మోడీ.. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ఆందోళన అక్కర్లేదంటూ తేల్చిచెప్పేశారు. అలాగే ఏఐ కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయంగా అందరూ కలిసి చేసే సామూహిక ప్రయత్నాలు మాత్రమే ఏఐ ప్రమాణాలను సృష్టించగలవని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఇవి కృత్రిమ మేథపై ఆవిష్కరణలను పెంచుతాయన్నారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications