ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర - పుతిన్ తో పోన్ చర్చలు : ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడండి..!!
ఉక్రెయిన్ - రష్యా యుద్దం వేళ ప్రధాని మోదీ కీలక బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు..ఇటు రష్యా అధ్యక్షుడితోనూ ప్రధాని ఫోన్ ద్వారా సుదీర్ఘ చర్చలు చేసారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ రెండు సార్లు చర్చలు చేసారు. ఉక్రెయిన్ పలుమార్లు భారత్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఓపెన్ గా అభ్యర్ధించింది. దీంతో..తాజాగా ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసారు. దాదాపు నిమిషాల పాటు ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు.
Recommended Video
ఉక్రెయిన్- రష్యా చర్చల పురోగతి గురించి ప్రధాని మోదీకి పుతిన్ వివరిచారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఉక్రెయిన్ లో సామాన్య ప్రజలు ఉండే ప్రాంతాల్లో దాడులు చేయకుండా నిర్ణయం తీసుకోవటం పైన పుతిన్ ను ప్రధాని అభినందించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న మంత్రులు- అధికారుల స్థాయి సంప్రదింపులు - చర్చలకు అదనంగా నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చల ద్వారా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని ప్రధాని ఆకాంక్షించినట్లుగా సమాచారం.

అంతకు ముందు ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడుతో మాట్లాడారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడిన సందర్భంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు కొనసాగడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. దీంతోపాటు ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో అందించిన సహకారానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. సుమీ నుంచి భారతీయుల తరలింపునకు సహకారం కావాలని కోరారు. ఒక వైపు చర్చలు చర్చలే..యుద్దం యద్దమే అన్నట్లుగా సాగుతున్న రెండు దేశాల తీరుతో మూడో విడత చర్చలు ఫలిస్తాయా లేదా అనే ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications