వరుసగా రెండో విదేశీ పర్యటనలో మోడీ: భారత్ మణిపూస అంటూ కీర్తించిన ఎన్నారైలు

లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఆయన ఈ దేశంలో పర్యటిస్తారు. అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటారు. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. మోడీ పర్యటిస్తోన్న దేశాల జాబితాలో వరుసగా ఇది రెండోది. ఇదవరకు మూడు రోజుల పాటు ఇటలీలో పర్యటించారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకున్నారు. అనంతరం రోమ్‌లో జీ20 సదస్సుకు హాజరయ్యారు.

రోమ్ నుంచి గ్లాస్గో

రోమ్ నుంచి గ్లాస్గో

మూడు రోజుల ఇటలీ పర్యటనను ముగించుకుని ఆయన బ్రిటన్‌కు బయలుదేరారు. ఐక్యరాజ్య సమితి నిర్వహించ తలపెట్టిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్26)లో పాల్గొంటారు. వాతావరణ మార్పులపై చర్చించడానికి ఏర్పాటు చేసిన 26వ సమ్మిట్ ఇది. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో భేటీ అవుతారు. ఇందులో పాల్గొనడానికి ప్రధాని మోడీ గ్లాస్గో చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రోమ్ నుంచి బయలుదేరిన ఆయన గ్లాస్గోకు వచ్చారు.

ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

గ్లాస్గో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు బ్రిటన్‌లోని భారత హైకమిషనర్, ఆ దేశా విదేశాంగ శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోడీ.. తాను బస చేయదలిచిన హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన వేచి చూస్తోన్న ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. హోటల్ వద్ద బారులు తీరి నిల్చున్న ప్రవాస భారతీయులు, వారి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. మోడీ.. భారత మణిపూస అంటూ ప్రవాస భారతీయులు నినాదాలు చేశారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.

షెడ్యూల్ ఇదే..

షెడ్యూల్ ఇదే..

విరామానంతరం ప్రధాని స్కాట్లాండ్‌కు చెందిన ఇండొలాజిస్ట్ లీడర్లతో భేటీ అవుతారు. అనంతరం ఐక్యరాజ్య సమితి 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ టు ద కన్వెన్షన్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తారు. అనంతరం- కెల్విన్‌గ్రో ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్పెషల్ వీవీఐపీ రిసెప్షన్‌కు హాజరవుతారు. 120 దేశాల అధినేతలు ఇందులో పాల్గొంటారు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    బోరిస్ జాన్సన్‌తో భేటీ

    బోరిస్ జాన్సన్‌తో భేటీ

    రెండో రోజు పర్యటనలో భాగంగా మోడీ బ్రిటన్ ప్రధానమత్రి బోరిస్ జాన్సన్‌ను కలుసుకుంటారు. యూకే-ఇండియా క్లైమెట్ పార్ట్‌నర్‌షిప్‌ అంశంపై ఆ ఇద్దరు నేతల మధ్య చర్చలు జరుగుతాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తారు. ఈ ఏడాది మేలో వర్చువల్ సమ్మిట్ ద్వారా భారత్-బ్రిటన్.. ఈ పార్ట్‌నర్‌షిప్‌పై సంతకాలు చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణం వల్ల అప్పట్లో ఈ భేటీ వర్చువల్ ద్వారా నిర్వహించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+