పాక్ చిరకాలం వర్థిల్లాలి.. డ్రోన్లు, మిలిటరీ సప్లై ఆగదు.. టర్కీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. ఉగ్రమూకలను ఏరి పారేయడంలో భారత్ చూపిన శక్తిసామర్థ్యాలు ప్రపంచ దేశాలను అబ్బుర పరిచాయి. ఇక దాయాది పాకిస్థాన్ కైతే భారత్ చుక్కలు చూపించింది. అటు సైనిక స్థావరాలపై దాడి చేసి పాక్ కు వణుకు పుట్టించింది. పలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ తీసింది.

భారత్- పాకిస్థాన్ యుద్ధం సమయంలో పాకిస్థాన్ కు డ్రోన్లు, మిలిటరీని సాయం చేసింది టర్కీ. పహల్గాం ఉగ్రదాడిని సైతం టర్కీ, అజర్ బైజాన్ లాంటి దేశాలు సమర్థిస్తూ వచ్చాయి. అయితే తాజాగా మరోసారి టర్కీ తన బుద్ధిని చూపించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎర్డోగన్ కు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో తమకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు అంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు.

PM Shehbaz Sharif Meets Turkish President Erdogan to Strengthen Bilateral Ties

ఇరు దేశాధినేతల సమావేశం అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఎక్స్ వేదికగా స్పందించారు. "నా సోదరుడు ఎర్డోగన్ తో సమావేశం కావడం సంతృప్తిగా అనిపించింది. భారత్- పాకిస్థాన్ యుద్దంతో మాకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇరు దేశాల మధ్య సైనిక, మిలిటరీ అంశాలపై చర్చించాం. వాణిజ్యం.. వ్యాపార లావాదేవీలపైనా పలు నిర్ణయాలు తీసుకున్నాం. లాంగ్ లీవ్ పాకిస్థాన్- టర్కీ ఫ్రెండ్ షిప్" అని పాక్ ప్రధాని షెహబాజ్ ట్వీట్ చేశారు.

మరోవైపు ఇరు దేశాల సమావేశంపై టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. " నా ప్రియమైన స్నేహితుడు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశం కావడం జరిగింది. వాళ్లకు ఆతిథ్యం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఎకానమీ, వ్యాపారం, భద్రత తదితర అంశాలపై కీలక చర్చలు జరిపాం. ఇరు దేశాల మధ్య ప్రతి అంశంలో ఒక అభిప్రాయానికి వచ్చాం. మా మధ్య ఈ సత్సంబంధాలు చిరకాలం కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

టర్కీ ఆపదలో ఉన్నప్పుడు భారత్ చేసిన సాయం మరిచి ఇప్పుడు పాకిస్థాన్ కు సపోర్ట్ చేయడంపై భారత్ లో టర్కీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బాయికాట్ టర్కీ అనే నినాదం దేశవ్యాప్తంగా వెల్లువెత్తింది. టర్కీతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. టర్కీ నుంచి పలు వస్తువులను భారత్ బ్యాన్ చేసింది. ఈ క్రమంలో టర్కీ- పాకిస్థాన్ మధ్య చర్చలు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+