వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా: దేవ దూతగా..పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన: కేంద్రమంత్రి సమక్షం

|
Google Oneindia TeluguNews

వాటికన్ సిటీ: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ప్రకటించారు. ఇకపై ఆమెను దేవ దూతగా భావించాలని సూచించారు. ఈ ఉదయం వాటికన్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రకటన చేశారు. మరియం థామస్ తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో అయిదుమందికి సెయింట్ హుడ్ హోదా లభించింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీథరన్ హాజరు అయ్యారు.

కేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదంకేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదం

బ్రిటన్ కు చెందిన కార్డినల్ జాన్ హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్ కు చెందిన మార్గరెట్ బేస్, బ్రెజిలియన్ సిస్టర్ డల్స్ లోపెస్, ఇటాలియన్ సిస్టర్ గుసెప్పినా వాన్నినీలకు సెయింట్ హుడ్ హోదా లభించింది. క్రైస్తవ మత ఆచారాల ప్రకారం సెయింట్ హుడ్ హోదా లభించాలంటే అనేక పరీక్షలు, నిబంధనలు ఉంటాయి. వారి హయాంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటే గానీ.. ఈ అత్యున్నతమైన సెయింట్ హుడ్ హోదా లభించింది. ఇదివరకు ఈ హోదా మదర్ థెరిసాకు లభించింది.

Pope Francis to elevate Indian nun Mariam Thresia to sainthood

1876 ఏప్రిల్ 26వ తేదీన కేరళలోని త్రిశూర్ జిల్లాలో మరియం థెరిసా జన్మించారు. 1904లో సన్యాసాన్ని స్వీకరించారు. నన్ గా మారిపోయారు. కుటుంబాన్ని త్యజించారు. మదర్ థెరిసా తరహాలో అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. తన చెల్లెళ్లు కూడా కలిసి రావడంతో తన సామాజిక కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 1914లో ఆమెకు థెరిసా అనే బిరుదు లభించింది. 1926 జూన్ 8న మరియం థెరిసా కన్నుమూశారు.

Pope Francis to elevate Indian nun Mariam Thresia to sainthood

ఆమె హయాంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మానవ మాత్రులు సాధించలేని అద్భుతాలు కావడంతో కేరళకు చెందిన క్రైస్తవ ప్రముఖులు సెయింట్ హుడ్ హోదా కోసం మరియం థెరిసా పేరును వాటికన్ సిటీకి సిఫారసు చేశారు. 2000లో పోప్ జాన్ పాల్-2 మరియం థామస్ కు నన్ హోదా ఇచ్చారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి అందిన సిఫారసులను పరిశీలించడానికి పోప్ ఫ్రాన్సిస్ నేతృత్వంలో 12 మంది సభ్యుల ఓ కమిటీ ఏర్పాటైంది. ఆయా సిఫారసులన్నింటినీ పరిశీలించింది. మరియం థామస్ కేవలం తన ఆశీర్వాద బలంతో రోగాలను నయం చేసినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మరియం థామస్ తో పాటు మరో అయిదుమందికి సెయింట్ హుడ్ హోదాను ఇస్తున్నట్లు ప్రకటించింది. జీసస్ పంపించిన దేవ దూతలుగా ఇకపై వారిని గుర్తించాలని పోప్ ఫ్రాన్సిస్ సూచించారు.

English summary
Pope Francis will declare Indian nun Mariam Thresia a saint on Sunday at a ceremony at the Vatican City, which would be attended by Minister of State for External Affairs V Muraleedharan. Mariam Thresia, who founded the Congregation of the Sisters of the Holy Family in Thrissur in May 1914, will be raised to the glory of the altar during a solemn Eucharistic Celebration in Rome's St Peter's Square.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X