Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు ఘని -తాలిబన్ వశమైన అఫ్గాన్ -కాబూల్‌లో లూటీలు -రష్యా మద్దతు!

ఇండియాతో సరిహద్దును పంచుకునే దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత నాలుగు వారాల వ్యవధిలోనే దేశం మొత్తాన్ని తాలిబన్ సేనలు ఆక్రమించుకున్నాయి. ఆదివారం నాటికి కాబూల్ సిటీని చుట్టుముట్టిన తాలిబన్ సేనలు.. రక్తపాతానికి తావు లేకుండా శాంతియుతంగా అధికార మార్పిడి కోసం అధ్యక్షుడు అష్రఫ్ ఘనిపై ఒత్తిడి పెంచాయి. ఆ మేరకు అంగీకారం కూడా కుదిరిందనే వార్త వెలువడగా, అసలు ఘని అధ్యక్ష భవనంలోనే లేడని, దేశం విడిచి పారిపోయాడని ఆలస్యంగా వెల్లడైంది..

పారిపోయిన అధ్యక్షడు..

పారిపోయిన అధ్యక్షడు..

అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. తాలిబన్ సేనలు దేశాన్ని ఆక్రమించుకోవడం, రాజధాని కాబూల్ నగరాన్ని సైతం చుట్టుముట్టిన క్రమంలో శాంతియుతంగా అధికార మార్పిడికి అంగీకరిస్తూనే ఆయన పరారయ్యారు. ఘని అఫ్గాన్ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారని ప్రెసిడెన్షియల్ ఆఫీసు నుంచి ప్రకటన వెలువడిన చాలా సేపటికిగానీ ఆయన పారిపోయిన విషయం వెలుగులోకి రాలేదు. ఘనీతో చర్చల కోసం తాలిబన్ల బృందం ఒకటి అధ్యక్ష భవనానికి వెళ్లగా అక్కడాయన లేరని వెల్లడైంది. అధ్యక్షుడు ఘని దేశం విడిచిపోయారనే విషయాన్ని ఆయన కార్యాలయం సైతం ధృవీకరించింది..

తజకిస్థాన్ జారుకున్న ఘని..

తజకిస్థాన్ జారుకున్న ఘని..

అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలకు తొత్తుగా వ్యవహరించిన అష్రఫ్ ఘని ప్రభుత్వాన్ని కూలదోయడమే తమ లక్ష్యమంటూ ప్రకటనలు చేసిన తాలిబన్ నేతలు ఆదివారం నాటికి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, తాలిబన్లు అధికారంలోకి రాగానే ప్రతీకార దాడులు తప్పవని ముందే గ్రహించిన అఫ్గాన్ మంత్రులు, సైనిక అధికారులు ఇప్పటికే దేశం విడిచిపెట్టి పారిపోయారు. అయితే, అధ్యక్షుడు ఘని మాత్రం ఆదివారం మధ్యాహ్నం దాకా తాను అధ్యక్ష భవంలోనే ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా అఫ్గాన్ పాలన తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయిన తర్వాతగానీ ఆయన దేశం విడిచిపోయారనే విషయం బయటికిరాలేదు. అష్రఫ్ ఘని పొరుగున ఉన్న తజకిస్థాన్ కు వెళ్లారని ఆయన కార్యాలయ అధికారి ఒకరు ప్రకటన చేశారు. భద్రతాపరమైన కారణాల రీత్యా ఘని కచ్చితంగా దేశాన్ని ఎప్పుడు విడిచివెళ్లారు, ప్రస్తుతం తజకిస్థాన్ లో ఎక్కడ ఉన్నారు అనే విషయాలను వెల్లడించలేమని ఆ అధికారి చెప్పారు. ఇటు,

కాపాడుతానని మాటిచ్చి పరారి...

కాపాడుతానని మాటిచ్చి పరారి...

అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయిన విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధులు సైతం నిర్ధారించారు. ఘని ఇప్పటికే రాజీనామా చేసిన దరిమిలా ఆయనను మాజీ అధ్యక్షుడిగా సంబోధిస్తూ.. ''అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు మేం కూడా ప్రయత్నిస్తున్నాం''అని తాలిబన్ ప్రతినిధులు ఫేస్ బుక్ ద్వారా ప్రకటన చేశారు. అయితే, శనివారం నాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఘని ప్రజలకు ఎంతో భరోసా ఇచ్చారు. దేశాన్ని తాలిబన్ల వశం కానీయబోనని గట్టిగా చెప్పారు. ''మీ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా.. అస్థిరత్వాన్ని నివారించడం, హింసను అడ్డుకోవడం వంటివాటిపై దృష్టిపెట్టాను. అఫ్గాన్‌ ప్రజలపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని నేను అంగీకరించను. గత 20ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేను. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సహించలేను. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్‌ భద్రత బలగాలను తిరిగి సమాయత్తం చేయడమే మా ప్రధమ ప్రాధాన్యం. దీనికి సంబంధించి కీలక చర్యలు చేపడుతున్నాం. ఇందుకోసం స్థానిక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, అంతర్జాతీయ సమాజంతో విస్తృత సంప్రదింపులు ప్రారంభించాం. సమస్య పరిష్కారం కోసం,. అఫ్గాన్‌లో శాంతిని నెలకొల్పడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం'' అని ఘని చెప్పారు. తాలిబన్ల బారి నుంచి అఫ్గాన్ ప్రజల్ని కాపాడుతానన్న ఆయనే దేశం విడిచి పరారైపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే,

కాబూల్‌లో లూటీలు.. ఎంటరైన తాలిబన్లు

కాబూల్‌లో లూటీలు.. ఎంటరైన తాలిబన్లు

అటు అధ్యక్షుడి పరారీ, ఇటు తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్ రాజధాని నగరం కాబూల్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది తాలిబన్ సైన్యాలు అన్ని వైపుల నుంచి నగరాన్ని చుట్టుముట్టి, రాకపోకల్ని నిషేధించారు. అమెరికా సహా ఇతర దేశాలు తమ దౌత్య అధికారుల్ని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకెళ్లిపోగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘని నుంచి శాతియుతంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలని తాలిబన్లు భావించారు. అందుకే తాలిబన్ సేనల్ని సిటీ సరిహద్దుల్లోనే ఉంచి, అధికార మార్పిడి చర్చలు మొదలుపెట్టారు. అయితే, ఘని దేశం విడిచి పారిపోవడంతో, దోహా వేదికగా జరుగుతోన్న చర్చా వేదికపైనే అధికార బదలాయింపు ఉండేలా తాలిబన్ నేతలు వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే కాబూల్ నగరంలో లూటీలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ మూకలు పెద్ద ఎత్తున గుమ్మికూడి దుకాణాలు, ఇళ్లలో దోపిడీలు మొదలుపెట్టారు. దీంతో లూటీలను ఆపేందుకు తాలిబన్లు తమ సైన్యాలను సిటీలోకి పంపాయి. ''కాబూల్ సిటీలో లూటీలను ఆపేందుకు మా తాలిబన్ సైనికులు సిటీలోకి ప్రవేశించారు''అని అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

Recommended Video

    Megastar Chiranjeevi ఆక్సిజ‌న్ బ్యాంకులు స్టార్ట్, Ram Charan పర్యవేక్షణ || Oneindia Telugu
    తాలిబన్లకు పెరుగుతోన్న మద్దతు..

    తాలిబన్లకు పెరుగుతోన్న మద్దతు..

    కాబూల్ సిటీని కైవసం చేసుకోవడంతో అఫ్గాన్ పై పట్టు సాధించిన తాలిబన్లకు అధ్యక్షుడు అష్రఫ్ ఘని పారిపోవడంతో పరిపాలన పగ్గాలు చేపట్టడం మరింత సులువైంది. ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తాలిబన్లు తమ అధ్యక్షుడిగా బరాదర్ వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే ఈ అధికార మార్పిడికి అంతర్జాతీయ సమాజం ఆమోదం కూడా ఉండేలా, దోహా వేదికగా జరుగుతోన్న చర్చల్లోనే ప్రక్రియ అధికారంగా నిర్వహించేలా తాలిబన్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లకు అధికార మార్పిడి జరిగే వేదికపై అమెరికా ప్రతినిధులు కూడా ఉండేలా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది జరగడానికి కనీసం 10రోజులైనా పట్టొచ్చని, అప్పటిదాకా తాత్కాలిక ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని తాలిబన్లు చెబుతున్నారు. మరోవైపు, తాలిబన్లకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. పాకిస్థాన్ బాహాటంగా తాలిబన్లకు మద్దతివ్వగా, భారత్ ను ఇరుకునపెట్టే వ్యూహంతో చైనా సైతం తాలిబన్లకు సూత్రప్రాయంగా సపోర్ట్ తెలిపింది. అటు రష్యా కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి సిద్దంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పుతిన్ కార్యాలయం తాజాగా ప్రకటన చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+