ప్రధానిగా మావోయిస్టు గెరిల్లా నేత ప్రమాణం- జై పశుపతి నాథ్- యోగి ఆదిత్యనాథ్ విషెస్..!!
ఖాట్మండు: పొరుగుదేశం నేపాల్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. మరోసారి మావోయిస్టు ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం ఏడు పార్టీల సంకీర్ణ కూటమి అందలం ఎక్కింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహల్ ప్రచండను ఎన్నుకయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శీతల్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరయ్యారు.
Pushpa Kamal Dahal of Communist Party of Nepal (Maoist Centre) took oath as the new Prime Minister of Nepal. pic.twitter.com/HA6LnELGne
— ANI (@ANI) December 26, 2022
68 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ మావోయిస్టు మాజీ గెరిల్లా నాయకుడు నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. 275 మంది సభ్యులు ఉన్న నేపాల్ పార్లమెంట్ లో 169 మంది పుష్ప కమల్ దహల్ ప్రచండకు మద్దతు తెలిపారు. దేశాధ్యక్షురాలికి ఈ మేరకు తాము సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దీనితో ప్రధానిగా ప్రచండ నియమితులు కావడానికి లైన్ క్లియర్ అయింది.

రబీ లామిచానేకి చెందిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీతో సహా మరో ఆరు పార్టీలతో కలిపి ప్రచండ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించారు. ప్రచండ.. మావోయిస్టు మాజీ గెరిల్లా నాయకుడు. 1996-2006 అంతర్యుద్ధం సమయంలో రాచరిక ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు నాయకుడిగా ఆయనకు ముద్ర ఉంది. 2006లో మావోయిస్టులతో రాచ కుటుంబం శాంతి ఒప్పందాలను కుదుర్చుకుంది.
श्री पुष्प कमल दहल 'प्रचंड' जी को नेपाल के प्रधानमंत्री निर्वाचित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) December 26, 2022
नि:संदेह, आपके यशस्वी नेतृत्व में भारत व नेपाल के राजनीतिक, व्यापारिक एवं सांस्कृतिक संबंधों में और अधिक प्रगाढ़ता आएगी।
जय पशुपतिनाथ!@cmprachanda
కాగా- నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రచండకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వామపక్ష నేతకు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి విషెస్ చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రచండకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తోన్నానంటూ యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. భారత్-నేపాల్ మధ్య రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. జై పశుపతి నాథ్ అంటూ ట్వీట్ ను ముగించారు యోగి ఆదిత్యనాథ్.












Click it and Unblock the Notifications