Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'అమెరికా ఆంక్షలు విధించినా.. భారత్ కు చమురు సరఫరా ఆగదు'

రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రష్యా నుంచి భారత్ కు ముడి చమురు సరఫరాపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు రష్యా.. నిరంతరాయంగా ముడి చమురును సరఫరా చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే టెర్రరిజంపై ఇరు దేశాల నేతలు పోరాడాలని నిర్ణయించారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీతో సంయుక్త పత్రికా సమావేశంలో మాట్లాడారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ భారత్ ను సందర్శించడం విశేషం.

భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, రష్యా భారత్‌ కు ఇంధనాన్ని నిరంతరాయంగా సరఫరా చేస్తుందని హామీ ఇచ్చారు. " రష్యా చమురు, గ్యాస్, బొగ్గు, భారత్ ఇంధన అభివృద్ధికి నమ్మకమైన సరఫరాదారు " అని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు ఉగ్రవాద వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్, రష్యాలు కలిసికట్టుగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఇరు దేశాలపై దాడులకు ఒకే మూలాలున్నాయని, ఈ పోరాటంలో ఒకరికొకరు కలిసికట్టుగా నిలబడతామని తెలిపారు. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దాడి అయినా లేక క్రోకస్ సిటీ హాల్ పై జరిగిన దాడి అయినా.. ఈ ఘటనలన్నింటికీ మూలం ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి, జీ20, బ్రిక్స్ కూటమి, SCO, ఇతర అంతర్జాతీయ వేదికలలో భారత్, రష్యాల మధ్య సన్నిహిత సహకారం ఉందని.. ఈ వేదికలన్నింటిలోనూ తమ సహకారం కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Putin to India Uninterrupted Oil Flows Despite US Fury A Defiant Energy Pact in New Delhi

ఇక గత సంవత్సరం భారత్- రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12శాతం వృద్ధి చెంది సుమారు 64 బిలియన్ డాలర్లకు చేరి రికార్డు సృష్టించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఉంటుందని, భవిష్యత్తులో దీనిని 100 బిలియన్ డాలర్లకు పెంచుతామని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా నుంచి భారత్ కు వచ్చే సందర్శకులకు ఉచిత ఈ- వీసా సదుపాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. దరఖాస్తులు 30 రోజుల్లోపు ప్రాసెస్ అవుతాయని పేర్కొన్నారు. ఈ- టూరిస్ట్, గ్రూప్ టూరిస్ట్ వీసా సేవలు త్వరలో ఉచితంగానే రష్యన్ పౌరుల కోసం ప్రారంభమవుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+