వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: నల్లటి వ్యక్తి తెల్లగా మారి కన్ను కొడతాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు కొత్త రకంగా ఆలోచించి ప్రకటనలు ఇస్తుంటాయి. అయితే, అందులో అతి చేస్తే మాత్రం ఇబ్బందులు వచ్చి పడతాయి. చైనాలోని ఓ లాండ్రీ డిటర్జెంట్ కంపెనీ ప్రకటన వివాదానికి కారణమైంది.

ఈ ప్రకటన జాత్యాహంకార దుమారం రేపింది. గత నెలలో ప్రసారమైన ఈ ప్రకటన సోషల్ మీడియాలో సందడిగా మారింది. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డిటర్జెంట్ ప్రకటన కర్తలు మాత్రం తమ లక్ష్యం నెరవేరిందని సంబరపడుతున్నారంటున్నారు.

Race row over Chinese laundry detergent company Qiaobi's commercial

యాడ్‌లో.. ఓ యువతి బట్టలు ఉతుక్కునేందుకు లాండ్రీ దుకాణానికి వెళ్తుంది. అక్కడ వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి నిల్చుంటుంది. నల్లజాతీయుడొకరు యువతిని చూసి కన్ను కొడతాడు. దీంతో ఆ యువతి అతడిని పిలుస్తుంది. తనకు ఒకే చెబుతుందని భావించి ఆమె వద్దకు వెళ్లిన యువకుడిని చాకచక్యంగా వాషింగ్ మెషీన్లో తోసేసి మూత వేసి, దానిపై నవ్వుతూ కూర్చుంటుంది.

కాసేపటికి ఆ మూత తీయగానే నల్లగా లోపల పడిన యువకుడు తెల్లగా చైనీయుడై బయటకు వచ్చి కన్ను కొడతాడు. ఈ యాడ్ చైనా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది జాత్యాహంకార యాడ్ అని, దీనిని నిషేధించాలని చాలామంది మండిపడుతున్నారు. ఆఫ్రికా జాతీయులను కించపరిచారంటున్నారు.

English summary
Race row over Chinese detergent advert showing a woman shoving a black suitor into a washing machine and then smiling in delight as he emerges as an Asian man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X