మళ్లీ ట్రక్ లో ప్రయాణించిన రాహుల్ గాంధీ-ఈసారి అమెరికాలో- జర్నీ ఎలా సాగిందంటే..
భారత్ లో బీజేపీ విద్వేష విధానాలకు నిరసనగా తాజాగా భారత్ జోడో యాత్ర చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతకు ముందు నుంచే సమాజంలో పలు వర్గాలతో కలిసిపోయే మనస్తత్వం కలిగిన రాహుల్.. జోడో యాత్ర తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. అయితే అంతకు ముందు కంటే ఎక్కువగా జనంతో కలిసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో ట్రక్ ప్రయాణం చేశారు.
భారత్ లో ఢిల్లీ నుంచి బయలుదేరి హర్యానాకు ట్రక్ లో అర్ధరాత్రంతా ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ ఈసారి తన తాజా యూఎస్ టూర్ లోనూ ట్రక్ ప్రయాణం చేశారు. వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ కు ట్రక్ లో రాహుల్ ప్రయాణించారు. ఓ భారతీయ డ్రైవర్ నడుపుతున్న యూఎస్ ట్రక్ ను ఎక్కిన రాహుల్ గాంధీ.. ఆయనతో కలిసి చలాకీగా మాట్లాడుతూ ఉత్సాహ పరిచారు. మధ్యలో రెండేళ్ల క్రితం హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట పెట్టాలంటూ డ్రైవర్ ను అడిగారు.

భారత్ లో ట్రక్ నడపటానికీ, యూఎస్ లో ట్రక్ నడపటానికీ మధ్య వ్యత్యాసం ఏంటనేది స్వయంగా రాహుల్ సదరు డ్రైవర్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రైవింగ్ ద్వారా అతను ఎంత సంపాదిస్తున్నాడేది కూడా అడిగారు. దీనికి సమాధానంగా డ్రైవర్ తాల్జిందర్ సింగ్.. భారత్ తో పోలిస్తే యూఎస్ లో తాను ఎక్కువగా డ్రైవింగ్ ద్వారా సంపాదిస్తున్నట్లు చెప్పాడు. తమ వల్ల యూఎస్ లో తయారీదారుల పని సులువవుతోందని కూడా వెల్లడించాడు.
These countries are growing by using our potential because we don’t have opportunities in India.
— Shantanu (@shaandelhite) June 13, 2023
The truck driver made this deep remark with Rahul Gandhi Ji.
Watch the full conversation: https://t.co/E5dhdGAlVs pic.twitter.com/eNx3WrKqJ8
అలాగే యూఎస్ లో ట్రక్ లు డ్రైవర్లు డ్రైవింగ్ చేసేందుకు అనువుగా తయారు చేయడం పట్ల కూడా రాహుల్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ లో డ్రైవర్లకు ఇలాంటి పరిస్ధితి ఉండదన్నారు. అనంతరం భారత్ కూ, యూఎస్ కూ డ్రైవింగ్ పరిస్ధితుల్లో ఉండే తేడాను కూడా వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా తాను భారత్ లో చేసిన ట్రక్ ప్రయాణాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు.
-
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ ను ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారా ? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications