అంతరిక్షం నుంచి భూమిపై తుఫాన్ చూశారా ? క్యూబాలో తీరం దాటిన అయాన్ దృశ్యాలు..
భూమిపై ఉన్నప్పుడు తుపాన్ వస్తేనే దాని దృశ్యాల్ని బంధించడం కష్టం. ఎక్కడో మేడలు, మిద్దెలపై నిలబడి వాటిని ఫొటోలు, వీడియోలు తీస్తే అదే గొప్పగా ఫీలయ్యే పరిస్దితి. అలాంటిది ఏకంగా ఓ దేశంలో వచ్చిన హరికేన్ (తుఫాన్)ను అంతరిక్షం నుంచి బంధించడం అంటే అషామాషీ విషయం కాదు. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని అస్ట్రోనాట్లు ఈ అరుదైన ఫీట్ సాధించారు.
క్యూబాలో తాజాగా అయాన్ హరికేన్ తీరం దాటింది. ఆ సమయంలో క్యూబా అంతా దారుణంగా వణికిపోయింది. భారీ ఎత్తున ఎగసిపడిన అలలు, తీరం దాటుతున్న సమయంలో దృశ్యాల్ని క్యూబన్లే ఫొటోలు, వీడియోలు తీసే పరిస్ధితి లేదు. అలాంటి సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి అస్ట్రోనాట్లు దీన్ని బంధించారు.
క్యూబాలో అయాన్ హరికేన్ తీరం దాటిన ఒక రోజు తర్వాత ఫ్లోరిడాను లక్ష్యంగా చేసుకుని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించింది. అయాన్ ఇప్పుడు కేటగిరీ-3 తుఫానుగా మారింది. ఇది కదులుతున్న దృశ్యాల్ని ఉపగ్రహాల చిత్రాల ద్వారా అంతరిక్షం నుంచి బంధించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు భూమిపై తిరుగుతున్న ప్రమాదకరమైన తుఫానును గుర్తించారు. ఆ సమయంలో తుఫాను క్యూబాకు దక్షిణంగా బలపడి ఫ్లోరిడా వైపు పయనిస్తోంది. మంగళవారం చివరిలో దక్షిణ ద్వీపకల్పం అంతటా ఉష్ణమండల-తుఫాను గాలులు అంచనా వేశారు. క్యూబాలోని పినార్ డెల్ రియో ప్రావిన్స్‌లో అయాన్ తీరం దాటింది. అక్కడ అధికారులు 55 శిబిరాలు ఏర్పాటు చేశారు. 50వేల మందిని ఖాళీ చేయించారు.

దేశంలోని ప్రధానంగా పొగాకు పెరిగే ప్రాంతంలో పంటలను రక్షించడానికి చర్యలు తీసుకున్నారు. ఇది వెచ్చని గల్ఫ్ ఆఫ్ మెక్సికోపై మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడా నైరుతి తీరాన్ని సమీపించే సరికి ఇది 130 mph (209 kph) వేగంతో గాలులకు కారణమవుతోంది. అక్కడ 2.5 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించారు.












Click it and Unblock the Notifications