బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం-హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఆటోమేటిక్ హెచ్4 వీసా
అమెరికాకు వెళ్లారంటే హెచ్1బీ వీసా తప్పనిసరి. కానీ ఇలా హెచ్1బీ వీసా తీసుకున్న వారి జీవిత భాగస్వాములను కూడా తీసుకెళ్లే విషయంలో మరిన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీనిపై అమెరికాలోని కోర్టుల్లో న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరికి ఇప్పుడు అమెరికా సర్కార్ ఈ విషయంలో దిగొచ్చింది.
అమెరికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్1బీ వీసా కలిగిన వారు తమ జీవిత భాగస్వాములను తోడు తెచ్చుకోవాలంటే ఇకపై ఆటోమేటిక్ వర్క్ ఆధరైజేషన్ ప్రాతిపదికన అనుమతించాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాలోని వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన స్ధానిక కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బైడెన్ సర్కార్ కూడా ఈ మేరకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం హెచ్ 4 వీసాలు జారీ చేస్తుంటుంది. కానీ వీటిని తరచూ పొడిగించుకోవాల్సి రావడం, రెగ్యులేటరీ పరీక్షలు రాయాల్సి రావడంతో చిక్కులు తలెత్తాయి. వీటిపై న్యాయవివాదాలు కూడా తలెత్తాయి. చివరికి ప్రభుత్వం ఆటోమేటిగ్గా వీరికి హెచ్ 4 వీసాలు జారీ చేసేందుకు వీలుగా నిబంధనలు సవరించింది. దీంతో వేలాది మంది భారతీయులు తమ జీవిత భాగస్వాములతో పాటు పిల్లల్ని కూడా ఆటోమేటిగ్గా అమెరికాలో ఉద్యోగాల కోసం తీసుకెళ్లేందుకు వీలు కలిగింది. గతంలో ఒబామా హయాంలో తొలిసారి భారతీయుల కుటుంబాలకు హెచ్4 వీసాల జారీ మొదలైంది. ఇప్పుడు బైడెన్ హయాంలో ఆటోమేటిక్ అనుమతులు లభించడంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications