కరోనాపై రీసెర్చ్ : కరోనా వైరస్ లోనూ రెండు రకాలు..ఏది డేంజర్ అంటే..
చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ఇక ఇండియాలోనూ కరోనా వైరస్ కేసులు నమోదు కావటం ఇండియన్స్ ను భయపెడుతుంది. ఇక ఈ నేపధ్యంలో అసలు కరోనా వైరస్ ఏంటి? దీనిని అరికట్టటం ఎలా అని పరిశోధనలు చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ ఒకటి కాదు అది రెండు రకాలుగా ఉంటుంది అని ఒక పరిశోధన వెల్లడించటం ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా
డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టి పక్క దేశాలకు వ్యాపిస్తూ భయపెడుతుంది కరోనా వైరస్ . ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోన్న ఈ కరోనా వైరస్ భారత దేశంలోనూ వ్యాపిస్తుంది. కరోనా వైరస్ పేరును కొవిడ్-19 వైరస్‌గా మార్చినా అందరికీ కరోనా అనగానే భయం మొదలవుతుంది. ఇక మన దేశంలో నిన్నా మొన్నటి దాకా ఎఫెక్ట్ లేదు అనుకున్న కరోనా వైరస్ భారత్‌లో బుధవారం నాటికి బాగానే వ్యాప్తి చెందింది .

కరోనా వైరస్‌పై అధ్యయనం చేసిన పెకింగ్, షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు
ఇక ఇటాలియన్ టూరిస్ట్ ల ద్వారా భారత్ లో పాగా వేసిన ఈ వైరస్ వల్ల 29 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే. కరోనా వైరస్ ఒకటే రకం కాదని దీనిలో రెండు రకాలు ఉన్నాయని తేల్చింది ఒక అధ్యయనం . కరోనా వైరస్‌పై పెకింగ్, షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఇక వీరు వీరి పరిశోధనకు గాను 103 కరోనా నమూనాలను సేకరించి ఆ నమూనాలను విశ్లేషించారు.

కరోనా వైరస్ లో ఎల్, ఎస్ అనే రెండు జాతులు
కొవిడ్-19లో ఎల్, ఎస్ అనే రెండు జాతులు ఉన్నట్టుగా వారు తమ పరిశోధనలో వెల్లడించారు .ఈ రెండు రకాల్లో ఎల్ రకం అత్యంత ప్రమాదకరమైన రకంగా వారు గుర్తించారు. 'ఎస్' రకం మొదటి నుంచీ ఉందని అది పెద్దగా హానికరం కాదని పరిశోధనలో తేలింది. కానీ జన్యు ఉత్పరివర్తనం కారణంగా 'ఎల్' రకం పుట్టుకొచ్చిందని ఎస్ రకం కంటే ఎల్ రకమే అత్యంత ప్రమాదరకమైనదని వారు తమ పరిశోధన ద్వారా తేల్చి చెప్పారు.
Recommended Video


కరోనా వైరస్ 'ఎల్' రకం యమా డేంజర్ అని తేల్చిన పరిశోధన
ఇప్పటి వరకు వ్యాపించినది, అందర్నీ వణికిస్తుంది కూడా ‘ఎల్' రకం అని పరిశోధకులు తేల్చారు. ఇక ఎస్ కంటే ఎల్ రకమే ఇన్నాళ్లూ ఎక్కువగా వ్యాపించినట్టు పేర్కొన్నారు. దాదాపు 70 శాతం ఎల్ రకం వైరస్ నుంచే వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్న వారు కరోనాకు పూర్తిగా చెక్ పెట్టే వైద్యాన్ని కనుగొనే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం .












Click it and Unblock the Notifications