కండల వీరుడు కావాలని మృత్యువుతో పోరాటం (ఫోటోలు)
బ్రెజిల్: అతని వయస్సు 25 సంవత్సరాలు, అప్పటికే మృత్యువు అంచులదాక వెళ్లి వచ్చాడు. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు జిమ్ చేస్తు బాడి బిల్డప్ చేసుకునే వారికి నీతులు చెబుతున్నాడు. బ్రిజిల్ కు చెందిన రొమారియో డాస్ (25) ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు.
బ్రెజిల్ లోని కాల్డాస్ నోవాస్ ప్రాంతానికి చెందిన రొమారియో డాస్ బాడిగార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతనికి కండలు పెంచాలని పిచ్చి పట్టింది. ఎలాగైనా కండలవీరుడు అనిపించుకొవాలని నిర్ణయించుకున్నాడు. అతని భార్య ఆరు నెలల గర్బవతిగా ఉన్న సమయంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
సింతటిక్ ఫిల్లర్ సింధాల్, ఆల్కాహాల్ ను నోటి ద్వారా కాకుండా ఇంజక్షన్ల రూపంలో శరీరంలోకి పంపించడం మొదలు పెట్టాడు. కండలు పెరిగిపోయాయి. రానురాను ఇంజక్షన్ లు శరీరంలోకి వెళ్లలేనంత దృఢంగా తయారయ్యాడు. 25 అంచుల మేరకు కండలు పెరిగిపోయాయి. చివరికి అతనికే భయం అయ్యింది. వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లాడు.
డాక్టర్లు అతనిని మందలించి మంచి మాటలు చెప్పారు. సింధాల్ విదానానికి చెక్ పెట్టమని చెప్పారు. అనారోగ్యంతో నానా తంటాలు పడ్డాడు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. అయితే దేవుడు కరుణించడంతో మృత్యువును జయించాడు. కండలు పెంచుకునే వారు జీవితంతో ప్రయోగాలు చెయ్యారాదని రొమారియో అంటున్నాడు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పిల్లలు ఇతనిని రాక్షసుడు, అడవి మృగం అని పిలుస్తుంటారు.

కండలు పెంచేశాడు
ఇతనికి కండలు పెంచాలంటే చాల ఇష్టం అందుకే ఇలా కండలు పెంచి అందరికి చుక్కలు చూపించాడు.

పుల్లాల ఉండేవాడు
పెళ్లి కాకముందు రొమారియో డాస్ ఇలా ఉండేవాడు. తరువాత కండలు పెంచాలని పిచ్చి పట్టింది.

జిమ్ కు అంకితం
కండలు పెంచాలని అనుకున్న తరువాత ప్రతి రోజు అనేక గంటలు జిమ్ కు పరిమితం అయిపోయాడు.

రొమారియో కుటుంబం
అందమైన భార్య, కుమారుడితో రొమారియో ఇలా కండలు ప్రదర్శిస్తున్నాడు

గుడ్లు, జ్యూస్ లు
రొమారియో ఎక్కుగా రోజు గుడ్లు, పాలు, జ్యూస్ లు ఆహారంగా తీసుకుంటాడు.

ఇంటిలో ఎక్కుగా
అనారోగ్యానికి గురి అయిన రొమారియో ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడుపుతుంటాడు, అతని చెయ్యిలావు అతని భార్య ఉంది.

ఎన్ని కేజీలు ఉంటే నాకేంటి
బైక్ ఎంత బరువు ఉన్నా తనకేంటి అంటు అవలీలగా 350 సీసీ బైక్ ఎత్తి తోడల మీద పెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications