Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Israel Palestine War : రష్యా మధ్యవర్తిత్వం ఆఫర్! కాల్పులు ఆపాలని ఇద్దరికీ పిలుపు..

ఇజ్రాయెల్ పై గత వారం భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఏకకాలంలో పాలస్తీనాకు చెందిన హమాస్ ప్రారంభించిన దాడులు, అనంతరం ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం కుదిరే సమయంలో ప్రారంభమైన ఈ దాడులతో ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దాడులు, ప్రతిదాడులతో వేల మంది పౌరులు మృత్యువాత పడుతున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా తాజాగా ఐక్యరాజ్యసమితి వేదిగా వీరిద్దరికీ ఓ ప్రతిపాదన చేసింది. ఇరు దేశాలూ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని రష్యా కోరింది. అలా చేస్తే ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్దమని ప్రకటించింది. పాలస్తీనా వెనుక రష్యా ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఇజ్రాయెల్ వార్ ఆపేందుకు ఆ దేశం చేసిన ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఇరుదేశాలూ ఇంకా స్పందించాల్సి ఉంది.

Russia calls for israel-Palestine ceasefire, offers mediation to end war

ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలకు మానవతా కోణంలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చేలా భద్రతా మండలికి రష్యా ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఇందులో పౌరులపై హింసతో పాటు అన్ని ఉగ్రవాద చర్యలను ఖండించింది.ఐరాస భద్రతా మండలి పూర్తి నిష్క్రియాత్మకత, ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడాన్ని రష్యా అంగీకరించదని అందులో పేర్కొంది. రష్యా కూడా ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.

రష్యా ముసాయిదా తీర్మానాన్ని ఐరాస ఓటింగ్‌కు పెడుతుందా లేదా అనేది వెంటనే తెలియలేదు. అయితే అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ను భద్రతా మండలి తీసుకునే చర్యల నుంచి రక్షించేందుకు సిద్ధంగా ఉంది. ఐరాసలో అమెరికా.. బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాతో పాటు వీటో అధికారాన్ని కలిగి ఉంది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా రాయబారి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు చేసిన విజ్ఞప్తిలో ఇజ్రాయెల్ మానవత్వానికి విరుద్ధంగా చేస్తున్న నేరాల్ని అడ్డుకోవాలని కోరారు. దీంతో ఇజ్రాయెల్ గాజా నుంచి ప్రజలు ఖాళీ చేయాలన్న హెచ్చరికలకు వ్యతిరేకంగా స్పందించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+