ఉక్రెయిన్ లో మరో 10 రోజులే రష్యా పోరు-నిండుకుంటున్న బాంబులు, సైనికులు-సంచలన రిపోర్ట్

ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించిన రష్యాకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. యుద్ధం ప్రారంభించి మూడు వారాలవుతున్నా ఇప్పటికీ ఉక్రెయిన్ పై పట్టు చిక్కడం లేదు. ఉక్రెయిన్ సేనలతో పాటు సామాన్య పౌరులు కూడా తిరగబడుతుండటంతో చేసేది లేక ఆస్పత్రులపై సైతం దాడులకు దిగుతున్న రష్యాకు మరో షాకింగ్ వార్త అందుతోంది. రష్యా వద్ద మరో పది రోజులు మాత్రమే యుద్ధం చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రి, సైనికులు ఉన్నట్లు తాజాగా ఓ రిపోర్ట్ వెలువడింది.

యూఎస్ కు చెందిన ఓ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంచనా ప్రకారం రష్యాకు మరో పది రోజుల పాటు ఉక్రెయిన్ లో యుద్ధం చేసే సామర్ధ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు మించి యుద్ధం జరిగితే రష్యాకు కష్టనష్టాలు తప్పేలా లేవు. యూఎస్ ఆర్మీలో గతంలో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ హడ్జెస్ తాజాగా బయటపెట్టిన ఈ వివరాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి.

russia is ten days away from exhausting ammunition and manpower in ukraine : reports

యూఎస్ ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని కొనసాగిస్తే రాబోయే పది రోజుల్లో రష్యా దళాల కొరత ఏర్పడుతుందని ఆయన తెలిపారు. వారికి సిబ్బంది సమస్యలు, మందు సామగ్రి సరఫరా కొరత ఉన్నాయని రష్యన్ ఆర్టీ, రాకెట్లు, క్రూయిజ్ క్షిపణులను నాశనం చేయడానికి ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అందుకే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో చర్చలకు మొగ్గుచూపుతోందా అన్న చర్చ కూడా మొదలైంది.

అదే సమయంలో భౌగోళిక రాజకీయ పరిస్థితిలో మార్పుల ఫలితంగా నాటో కూటమి తూర్పు భాగానికి వేల సంఖ్యలో అదనపు దళాలను పంపుతోంది. లిథువేనియాలో తమ మిత్రదేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి మూడు కొత్త సైనిక శిబిరాలను సృష్టిస్తామని కూడా ప్రకటించింది. పబ్రాడే, కజ్లా రూడా & మారిజాంపోల్‌లో బలగాలు దిగుతాయని తేలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+