రష్యా అణు బలగాల విన్యాసాలు-ఉక్రెయిన్ పై అణ్వస్త్ర దాడి తప్పదా ?

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా ఫలితం మాత్రం తేలడంలేదు.ఉక్రెయిన్ లోని పారిశ్రామిక నగరం డోన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కీలకమైన తూర్పు ఉక్రేనియన్ నగరమైన సీవీరోడోనెట్స్క్‌లో సగభాగాన్ని ఉన్మాద రష్యన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని స్ధానిక మేయర్ వెల్లడించారు.

రష్యా యొక్క అణు దళాలు మాస్కోకు ఈశాన్యంలోని ఇవానోవో ప్రావిన్స్‌లో డ్రిల్‌లు నిర్వహిస్తున్నాయని, ఇవాళ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ పేర్కొంది. యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లాంచర్లతో సహా 100 వాహనాలను ఉపయోగించి సుమారు 1,000 మంది సైనికులు తీవ్రమైన విన్యాసాలలో కసరత్తు చేస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఉక్రెయిన్ పై యుద్ధం ముగింపుకు అణుదాడిని రష్యా ఎంచుకోబోతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Russia’s nuclear forces holding manoeuvre drills, says report

ఉక్రెయిన్ పై దాదాపు మూడు నెలలుగా దాడులు కొనసాగిస్తున్నా పాశ్చాత్యదేశాల సాయంతో జెలెన్ స్కీ బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. దీంతో రష్యా పరువు నానాటీకీ పోతోంది. అంతర్జాతీయంగా ఆంక్షల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా రష్యా అణుదాడిని ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉక్రెయిన్ ను పూర్తిస్ధాయిలో స్వాధీనం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో రష్యా తమ అణుబలగాలతో విన్యాసాలు చేయిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+