వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చావు బతుకుల్లో పుతిన్- ఇక ఎంతో కాలం బతకడు- ఇంటెలిజెన్స్ సంచలన రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

మాస్కో: దాదాపుగా సంవత్సర కాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా యుద్ధం సాగుతోంది. దీనికి బ్రేకులు పడట్లేదు. అంతం అనేది ఉండట్లేదు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

విశాఖపై జగన్ ఇంటర్నేషనల్ స్కెచ్ - సక్సెస్ అయితే తిరుగేలేదు..!!విశాఖపై జగన్ ఇంటర్నేషనల్ స్కెచ్ - సక్సెస్ అయితే తిరుగేలేదు..!!

పలు నగరాలపై..

పలు నగరాలపై..

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా బలగాలు ప్రయత్నిస్తోన్నప్పటికీ- ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.

ఉక్రెయిన్ ఎదురుదాడిలో..

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్.. ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రష్యాపై ఎదురుదాడి చేస్తోంది. తాజాగా ఖేర్సన్ ను రష్యా ఆధీనం నుంచి విడిపించుకోగలిగింది. ఉక్రెయిన్ సైనిక బలగాల కౌంటర్ అటాక్ లో రష్యాకు చెందిన వందమందికి పైగా జవాన్లు మృతిచెందినట్లు వార్తలొస్తోన్నాయి. రష్యా ఆధీనంలోని వంతెనలు, ఖేర్సన్ చుట్టూ ఉన్న ఇతర స్థానాలపై ఎడతెగని దాడుల తర్వాత ఉక్రెయిన్ ఈ పురోగతిని సాధించింది.

రెండు రోజుల విరామం..

రెండు రోజుల విరామం..

కాగా- వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన రెండు రోజుల కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఆర్థొడాక్స్ క్రిస్మస్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని 36 గంటల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆర్డర్స్ పై సంతకాలు చేశారు. ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. రష్యా భూభాగంగా భావిస్తోన్న డోనెట్స్క్, లుహాన్స్క్ వంటి రీజియన్లల్లో రష్యా సైనికులు కాల్పుల విరమణను పాటిస్తోన్నారు.

పుతిన్ హెల్త్ ఇన్ డేంజర్..

పుతిన్ హెల్త్ ఇన్ డేంజర్..

ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలొ బుడనోవ్ సంచలన ప్రకటన చేశారు. వ్లాదిమిర్ పుతిన్ చావు బతుకుల్లో ఉన్నారని, ఎంతో కాలం బతకడని స్పష్టం చేశారు. పుతిన్ ప్రమాదకరమైన కేన్సర్ తో బాధపడుతున్నారని, యుద్ధం ముగియక ముందే ఆయన మరణించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

 కేన్సర్ కావొచ్చు..

కేన్సర్ కావొచ్చు..

వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, దీనికి కేన్సరే కారణమని అంచనా వేస్తోన్నట్లు బుడనోవ్ పేర్కొన్నారు. పుతిన్‌ కు సన్నిహితుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వివరించారు. పుతిన్ మరణానంతరం రష్యాలో అధికార మార్పిడి చోటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మరో కొత్త నాయకుడి చేతికి రష్యా అధ్యక్ష పదవి వెళ్తుందని, అలాంటి రోజుల కోసం ఎంతోకాలం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు.

English summary
Ukrainian Head of Military Intelligence said in an interview that the Russia President Vladimir Putin is terminally ill and he will die before the war ends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X