పుతిన్ నివాసంపై దాడి.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన రష్యా..

రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ వివరాలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బయటపెట్టారు. నోవ్ గొరోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసంపై దాడికి ఉక్రెయిన్ ప్లాన్ చేసిందన్నారు. అయితే లావ్రోవ్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ తప్పు బట్టింది. ఈ క్రమంలో ఈ దాడులకు సంబంధించిన వీడియోలను రష్యా తాజాగా విడుదల చేసింది.

నోవ్ గొరోడ్ ప్రాంతంలోని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనంపై ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్లు కథనాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. పుతిన్ అధికారిక నివాసం పైకి 91 డ్రోన్ లతో ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్ వేసిందని అన్నారు. అయితే ఈ డ్రోన్ లను రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా నేలకూల్చిందని వివరించారు. రష్యన్ స్టేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఉక్రెయిన్ ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. దాంతో రష్యా రక్షణశాఖ ఇందుకు సంబంధించిన వీడియోలను బయటపెట్టింది. ఈ వీడియోలో కూలిన డ్రోన్ ఒకటి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Russia Releases Shocking Video of Downed Drone from Alleged Attack on Putin s Residence

మరోవైపు పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్ దాడిని భారత ప్రధాని నరేంద్రమోదీతీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఘర్షణలకు ముగింపు పలకడం, శాంతి సాధనకు ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నమే మార్గమని తెలిపారు. ఇక ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు విజయవంతం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ కు అమెరికా దాదాపు 15 ఏళ్లపాటు సెక్యూరిటీని కల్పించనున్నట్లు సమాచారం. రష్యా భూ ఆక్రమణను నిరోధించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా భద్రతను ఇస్తుందని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ 15 ఏళ్లపాటు కాకుండా 50 ఏళ్ల పాటు అమెరికా భద్రత ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+