గుడ్‌న్యూస్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం, వ్యాక్సిన్ అభివృద్ధికి రష్యా ప్లాన్

మాస్కో: కరోనా మహమ్మారిని నివారించే వ్యాక్సిన్ తయారీలో రష్యా ముందడుగు వేసింది. కరోనావైరస్ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్లు రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం వెల్లడించింది. రష్యాకు చెందిన గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 18న ప్రారంభించారు.

వాలంటీర్లపై పరీక్షలు పూర్తయ్యాయని ఆ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ‌లేషనల్ మెడిసిన్ అండ్ బయో టెక్నాలజీ డైరెక్టర్ వాడిత్ తారాసోప్ తెలిపారు. పరీక్షలు చేపట్టిన తొలి గ్రూప్ వాలంటీర్లు బుధవారం డిశ్చార్జ్ కానున్నారు. ఇక రెండో గ్రూప్ జులై 20న డిశ్చార్జ్ అవుతారని తారాసోవ్ వెల్లడించారు.

 Russia’s Sechenov University says it has completed clinical trials of world’s first corona vaccine

ఈ దశ లక్ష్యం వ్యాక్సిన్ భద్రతను పరీక్షించడం అని, అది విజయవంతంగా జరిగిందని యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్ బోర్న్ డిసీజెన్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలిపారు. టీకా భద్రత నిర్ధారణ అయ్యిందని, ఆది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళికలను ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు.

కాగా, భారత్ తోపాటు అనేక ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్లు తయారు చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా 12,899,477 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568,836 మంది మరణించారు. 7,517,940 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Recommended Video

    RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+