వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సాయం కోరిన రష్యా- వైద్య సామాగ్రి సరఫరాకు వినతి- ఉక్రెయిన్ వార్ దెబ్బతో

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టి రెండునెలలు కావస్తున్నా ఎలా ముగించాలో తెలియక ఇబ్బందులు పడుతున్న రష్యాకు సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమదేశాల ఆంక్షలతో కుదేలైన రష్యాకు ఇప్పుడు వాణిజ్యపరంగా సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా వైద్యసామాగ్రి కొరతతో రష్యా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో భారత్ ను సాయం కోరింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి తర్వాత యూరప్, చైనా నుంచి దిగుమతులను బాగా తగ్గాయి. తర్వాత ఆంక్షలు, లాజిస్టికల్ సమస్యలతో భారతదేశం నుంచి మరిన్ని వైద్య పరికరాలను రష్యా కోరుతోంది.భారత్, రష్యాకు చెందిన వైద్య సామాగ్రి ఉత్పత్తి కంపెనీలు ఏప్రిల్ 22న జరిగే వర్చువల్ సమావేశంలో సరఫరాలను పెంచే మార్గాలను చర్చిస్తాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరమ్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. ఈ విషయాన్ని ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించే వ్యాపార సమూహం బిజినెస్ రష్యా ధృవీకరించింది.

Russia Seeks Medical Equipment From India As ukraine War Disrupts supplies

మాస్కో భారీ అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొంటున్నందున ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగించడానికి ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఉపయోగించిన మాదిరిగానే స్థానిక కరెన్సీలలో చెల్లింపు వ్యవస్థను రెండు దేశాలు రూపొందించడంతో రష్యాకు ఎగుమతులను పెంచాలని భారతదేశం భావిస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నించిన తరువాత, రష్యా చమురును మరింతగా కొనుగోలు చేసినందుకు భారత్.. పశ్చిమదేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం రష్యా మార్కెట్‌లో భారత్ ఓ కీలక శక్తిగా ఉంది. ఈ సంవత్సరం ఎగుమతులను దాదాపు 10 రెట్లు అంటే 2 బిలియన్ రూపాయలకు ($26.2 మిలియన్లు) పెంచాలని భారత్ భావిస్తోంది.

English summary
russia seek india's medical equipment help amid ukraine war crisis and trade issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X