రష్యా సైన్యం నుంచి భారతీయులకు విముక్తి..! మోడీ వినతికి సై అన్న పుతిన్..!
భారత్ కు చెందిన వందలాది మంది సైనికులు రష్యా ఆర్మీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. గతంలో రష్యాకు బందీలుగా పట్టుబడ్డ భారతీయుల్ని బలవంతంగా సైన్యంలో చేర్చి వారి సేవల్ని వాడుకుంటున్నారు. దీనిపై కొన్నేళ్లుగా వివాదం పెండింగ్ లోనే ఉంది. అయితే తాజాగా ఇందులో కొందరు చనిపోవడంతో భారత ప్రభుత్వంపై వీరిని విడిపించాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రధాని మోడీ తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్ దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు.
మాస్కో పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రష్యా ఆర్మీలో మగ్గిపోతున్న భారతీయుల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పుతిన్.. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ డిశ్చార్జ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేస్తున్న యుద్ధంలో తాజాగా ఇద్దరు భారతీయులు చనిపోయారు.

అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న డజన్ల కొద్దీ భారతీయ సైనికులు అక్కడ పోరాడేందుకు అయిష్టంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు భారతీయ సైనికులు.. ఉక్రెయిన్ యుద్దంలో తాము మోసపోయినట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే తమకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం రష్యాతో సంప్రదింపుల ద్వారా వీరికి విముక్తి కల్పించింది.
#Russia has agreed to discharge and facilitate the return of all Indians serving in the Russian Army following discussions between Indian Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin. This decision comes after India pressed for the return of its citizens,… pic.twitter.com/4AWt9PtywM
— Amit Bhatia I अमित भाटिया (@ameet1012) July 9, 2024
అలాగే తప్పుడు సాకులు, హామీలతో భారతీయుల్ని రష్యా సైన్యంలో రిక్రూట్ చేసిన ఏజెంట్ల, అసాంఘిక శక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు కూడా దాడులు నిర్వహించి రష్యాకు భారతీయులను అక్రమ రవాణా చేస్తున్న రింగ్‌ను ఛేదించాయి. దాడుల సమయంలో ఈ సంస్థలు కనీసం 35 మంది భారతీయులను రష్యాకు పంపినట్లు బయటపడింది. అయితే వీరంతా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారా లేదా అన్నది నిర్దారణ కాలేదు.












Click it and Unblock the Notifications