భారత్ కు రష్యా మరో భారీ సాయం.. పాకిస్థాన్, చైనాకు బ్యాడ్ న్యూస్

భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్- రష్యా మధ్య సత్సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా.. అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలు హెచ్చరించినా భారత్ మాత్రం రష్యా చేతిని అసలు విడిచిపెట్టలేదు. అలాగే భారత్ కు అతిపెద్ద రక్షణ భాగస్వామిగా రష్యా ఉంది. మన సైన్యంలో ఉన్న మెజారిటీ ఆయుధాలు, యుద్ధ విమానాలు రష్యా టెక్నాలజీతో కూడినవే.. బ్రహ్మోస్ క్షిపణి, ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థల్ని భారత్.. రష్యా నుంచి కొనుగోలు చేసింది. అలాగే కేవలం ఆయుధాలతోనే పరిమితం కాకుండా భారత్ లోనే ఏకే- 203 రైఫిళ్లు, సుఖోయ్ యుద్ధ విమానాల తయారీ వంటి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ రష్యా భారత్ కు సహకారం అందిస్తోంది.

అలాగే రష్యా నుంచి భారత్ బారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్ కు ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఇదే కాక తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం రష్యా సాంకేతిక సహకారంతోనే నిర్మించారు. అయితే తాజాగా మరో రంగంలోనూ భారత్ కు రష్యా సహకారం అందిస్తోంది. ప్రస్తుతం భారత్ లో బుల్లెట్ ట్రైన్స్, మెట్రోలు, హైవేలు, డిఫెన్స్ కారిడార్లు, స్మార్ట్ సిటీల నిర్మాణం కారణంగా ఉక్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

2030 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 220 మిలియన్ టన్నుల నుంచి 300 మిలియన్ టన్నులకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉక్కు పరిశ్రమకు అత్యంత కీలకమైన కోకింగ్ బొగ్గు సరఫరాలో రష్యా భారత్ కు అండగా నిలవనుంది. ప్రస్తుతం భారత్ కోకింగ్ బొగ్గు కోసం ఎక్కువగా ఆస్ట్రేలియాపై ఆధారపడుతోంది. అయితే ఇప్పుడు రష్యా ప్రత్యామ్నాయంగా మారనుంది.

Russia to Supply Coking Coal India Key Support for Steel Production Bad News for Pakistan and China

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మార్కెట్, లోహాల ప్రాసెసింగ్, కీలక ఖనిజాల సరఫరా గొలుసుపై చైనాకు భారీ ఆధిపత్యం ఉంది. ఇప్పుడు ఈ రంగంలో భారత్- రష్యాల మధ్య బంధం బలపడితే చైనాపై ఆధారపడటం తగ్గుతుంది. అంతేకాక గ్లోబల్ మార్కెట్ లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించినట్టుగా అవుతుంది. ఇది చైనాకు గట్టి ఎదురు దెబ్బగానే భావించాలి. ఇక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, డిఫెన్స్ ఎక్విప్ మెంట్లు, హై- స్పీడ్ రైల్వేల్లో వాడే ప్రత్యేకమైన ఉక్కు తయారీలో రష్యాతో భారత్ భాగస్వామ్యం కానుంది. భారత్ అనేక రంగాల్లో రాణిస్తుండటం అటు పాకిస్థాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+