కుప్పకూలిన మిలిటరీ విమానం.. ఆరుగురు మృతి.. షాకింగ్ విజువల్స్ వైరల్..
రష్యాలోని అమూర్ ప్రాంతంలో టీయూ-95 బాంబర్ అనే మిలిటరీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈస్ట్రర్న్ అమూర్ ప్రాంతం క్రాస్నోయారోవో గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ప్రమాద సమయంలో మిలిటరీ విమానంలో ఏడుగురు ఉన్నారని వివరించింది.
" సెప్టెంబర్ 29 రోజున టీయూ-95 ఎయిర్ క్రాఫ్ట్ అమూర్ రీజియన్ లోని గుర్తు తెలియని ప్రదేశంలో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. వారిని తక్షణమే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు" అని డిఫెన్స్ మినిస్ట్రీ స్పష్టం చేసిందని స్టేట్ రన్ టాస్ అనే న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
A Russian Tu-95MS bomber crashed minutes after takeoff near the village of Krasnoyarovo. Seven people were on board. Six have died, two of them on the way to hospital. The aircraft's fuel tanks exploded after impact and the wreckage caught fire.
— Open Source Intel (@Osint613) September 29, 2026
pic.twitter.com/EcfxWrwirg
ప్రాథమిక సమాచారం ప్రకారం టీయూ- 95 ఎంఎస్ బాంబర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే క్రాష్ అయింది. ఎయిర్ క్రాఫ్ట్ లోని ఫ్యూయల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగి ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలింది. దాంతో ప్రమాద ధాటికి విమానంలోని ఏడుగురు క్రూ సిబ్బందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటల్లో విమానం పూర్తిగా కాలిపోతుండగా అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

అయితే ప్రమాదం జరగడానికి గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ డ్రోన్ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications
