russia-ukrain war : ఉక్రెయిన్ సరిహద్దుల్లో జాత్యహంకారం-ఆఫ్రికన్లకు అష్ట కష్టాలు

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర పలు దేశాలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో విద్యాభ్యాసం కోసం వచ్చిన పలువురు విదేశీ విద్యార్ధులు రష్యా దాడులతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పారిపోతున్నారు. ఇలా పారిపోతుున్న వారిని సైతం సరిహద్దుల్లో వదలడం లేదు. ఇదే క్రమంలో తమపై జాత్యహంకారం చూపుతున్నారంటూ పలువురు ఆఫ్రికా విద్యార్ధులు చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ఉక్రెయిన్ లో చిక్కుకుని పోలాండ్ కు పారిపోతున్న క్రమంలో పలువురు ఆఫ్రికా విద్యార్ధులు తమకు ఎదురైన అనుభవాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అసలే గడ్డకట్టే చలితో పాటు జాత్యహంకారం కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నల్లజాతి విద్యార్ధులు వాపోయారు. నిద్ర లేకుండా గడ్డ కట్టే చలిలో ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న తమపై సైనికులు దాడులు చేసి గాయపరిచినట్లు వారు చెప్తున్నారు. సరిహద్దు గార్డులు ఆఫ్రికా విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డుకుని, ఉక్రేనియన్లకు ప్రాధాన్యత ఇచ్చారని, తమపై దాడులు కూడా చేశారని వారు ఆరోపిస్తున్నారు.

russia-ukrain war : racism at Ukrainian borders during evacuation of african nationals

తమను జంతువుల్లా హింసిస్తున్నట్లు భావించామని ఆఫ్రికా విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీలో చదువుతున్న గురురే ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని పంపిన కొన్ని గంటల తర్వాత కీవ్ కు పారిపోయింది. తాము కీవ్ నుంచి బయలుదేరినప్పుడు మనుగడ కోసం ప్రయత్నిస్తున్నమని, కానీ వారు మమ్మల్ని అలా హింసిస్తారని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది.మనమందరం సమానమని, మనం కలిసి నిలబడటానికి ప్రయత్నిస్తున్నామని అనుకున్నానని గురురే పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+