Russia-Ukraine Conflict:దెబ్బకు దెబ్బ: ఐదు రష్యా విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్..ముదురుతోన్న వార్..!!
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఆ దేశం కూడా రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓ వైపు రష్యా దూకుడుగా వ్యవహరిస్తుండగా... ఉక్రెయిన్ మాత్రం అదను చూసి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. గురువారం ఉదయం నుంచే రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులతో రెచ్చిపోయింది. ఓ వైపు పలు అగ్రదేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్న ఇవేమీ పట్టించుకోని పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ లక్ష్యంగా దాడులకు తెగబడింది. అక్కడి మిలటరీ స్థావరాలు, డిఫెన్స్ స్థావరాలే టార్గెట్‌గా రష్యా క్షిపణులను ప్రయోగించింది.
Recommended Video
మిలటరీ స్థావరాలనే టార్గెట్ చేశామంటున్న రష్యా
రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. గత కొంత కాలంగా స్తుబ్ధుగా సాగి వ్యవహారం ఇప్పుడు ఒక్కసారిగా కాక మీద ఉంది. రష్యా యుద్ధం చేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఉక్రెయిన్ కూడా తమ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి ఆదేశంలోకి ప్రవేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.
అయితే రష్యా మాత్రం తాము కేవలం మిలటరీ స్థావరాలు, డిఫెన్స్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ప్రకటించింది. తాము సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రష్యా క్షిపణులు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఐదు రష్యా విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్
రష్యా పాల్పడుతున్న ఈ దుశ్చర్య పట్ల ఉక్రెయిన్ కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఐదు విమానాలు ఒక హెలికాఫ్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో రష్యా మరింతగా రెచ్చిపోయి ఉక్రెయిన్‌కు మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పుతిన్ దుశ్చర్యను ఉక్రెయిన్ అడ్డుకుని తీరుతుందని ఆదేశ విదేశాంగమంత్రి చెప్పారు. ఓ వైపు పుతిన్ యుద్ధంపై ప్రకటిస్తున్న సమయంలోనే మరోవైపు కివ్, ఖర్కివ్ నగరాల్లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఆ తర్వాత కాసేపటికే ఎయిర్ సైరన్ వినిపించినట్లు సమాచారం. అంటే ఆ నగరాలపై దాడులు జరగుతున్నట్లుగా సంకేతాలు వెలువడ్డాయి.
అండర్ గ్రౌండ్ మెట్రోలో తలదాచుకుంటున్న ఉక్రెయిన్ పౌరులు
రష్యా ఉక్రెయిన్‌పై మరికొన్ని గంటల్లో దాడులకు తెగబడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్స్ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే దాడులు జరగడం విశేషం. ఇదిలా ఉంటే భారీ పేలుళ్లు కివ్ నగరంలో వినిపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు.
ఇక ఉక్రెయిన్‌లో ఉన్న వివిధ దేశాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయా దేశ ప్రభుత్వాలు ప్రకటనలు జారీ చేశాయి. ఇప్పటికే భారత్ పలు విమానాలను కివ్ నగరంకు పంపగా తాజా ఘటనతో బయలుదేరి వెళ్లిన విమానాన్ని వెనక్కు రప్పించింది.












Click it and Unblock the Notifications