Russia-Ukraine War:ఉక్రెయిన్ ను పునర్నిర్మించుకుంటాం-జెలెన్ స్కీ ప్రతిన-రష్యాకు హెచ్చరికలు
తమ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో దేశ పౌరుల్ని సైనికులుగా మార్చి ఎదురుదాడి చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇవాళ మరోసారి ఈ యుద్ధంపై స్పందించారు. తమ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధానికి భవిష్యత్తులో తప్పక మూల్యం చెల్లించుకుంటుందన్నారు.
రష్యాతో యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇవాళ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేసిన ప్రతిదానికీ రష్యా తిరిగి చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు.తాము రెండు ప్రపంచ యుద్ధాలు, మూడు కరువులు, హోలోకాస్ట్, బేబిన్ యార్, గొప్ప ప్రక్షాళన, చోర్నోబిల్ పేలుడు, క్రిమియా ఆక్రమణ, మా రాష్ట్రానికి తూర్పున యుద్ధం నుండి బయటపడ్డామని జెలెన్ స్కీ గుర్తుచేశారు. రష్యా మమ్మల్ని చాలాసార్లు నాశనం చేయాలనుకుందని, కానీ చేయలేకపోయిందని జెలెన్ స్కీ పేర్కొన్నారు. తాము చాలా కష్టపడ్డామమని, యుద్దం తర్వాత ఉక్రెయిన్లు ఎలా ఉండబోతున్నారో రష్యా అదినేత పుతిన్ కు అస్సలు తెలియదని జెలెన్ స్కీ వెల్లడించారు.

రష్యా దళాలు ఫిబ్రవరి 24న ప్రత్యేక సైనిక కార్యకలాపాల ముసుగులో ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించాయని జెలెన్ స్కీ తెలిపారు. ఈ దాడుల్లో 2 వేల మంది పౌరులు, కనీసం 498 మంది రష్యన్ సైనికులు మరణించారని ఆయన వెల్లడించారు. ఐరాస అంచనాల ప్రకారం రష్యా దాడుల నేపథ్యంలో కనీసం లక్షా 60 వేల మంది ఉక్రేనియన్లు పారిపోయి పొరుగు దేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. దీంతో రష్యాపై ఉక్రెయిన్ పౌరుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓవైపు చర్చలంటూనే మరోవైపు దాడులు కొనసాగిస్తున్న రష్యాపై ప్రపంచ దేశాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయిు.












Click it and Unblock the Notifications