అంతరిక్షాన్ని నడిపేదెవరు ? రష్యా-ఉక్రెయిన్ పోరుతో కొత్త ప్రశ్నలు-పరస్పర తోడు లేకుండా

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ చరిత్ర గతిని మార్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతరిక్ష ప్రయోగాలు, వాటి నిర్వహణ విషయంలో ప్రపంచ దేశాల నిర్ణయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ అంరిక్ష కేంద్రంతో పాటు అంతరిక్షంలో పలు ప్రయోగాలకు పరస్పర సహకారం అందించుకుంటున్న దేశాలు తాజా యుద్ధంతో వేరుబాట పట్టడంతో వాటి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

 అంతరిక్షంలో ప్రపంచదేశాలు

అంతరిక్షంలో ప్రపంచదేశాలు

ప్రపంచ దేశాల మధ్య వివిధ అంశాల్లో భిన్న వాదనలు, వైఖరులు ఉన్నప్పటికీ అంతరిక్షం విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఏకాభిప్రాయమే ఉంది. అంతరిక్షంలో ఎక్కువ విషయాల్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో పాటు ఇతరుల కంటే పైచేయి సాధించాలనే ఆరాటమే ఉంది. దీంతో అంతరిక్ష ప్రయోగాల కోసం అందరికీ ఉపయోగపడేలా కొన్ని ఉమ్మడి ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. అలా ఏర్పాటు చేసిందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్). ఇప్పుడు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశంపై అంతర్జాతీయంగా విధిస్తున్న ఆంక్షలతో ఈ వ్యవహారం బెడిసి కొట్టేలా కనిపిస్తోంది.

 ఐఎస్ఎస్ కుప్పకూలుతుందని రష్యా హెచ్చరిక

ఐఎస్ఎస్ కుప్పకూలుతుందని రష్యా హెచ్చరిక

ఉక్రెయిన్ పై తమ దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలతో రష్యా ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాము అందిస్తున్న సహకారం పునస్సమీక్షించుకునేందుకు రష్యా సిద్దమవుతోంది. అదే జరిగితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కుప్పకూలే ప్రమాదం ఉందంటూ రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్ధ రాస్ కాస్మోస్ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో రష్యాపై దూకుడుగా ఆంక్షలు విధిస్తున్న యూఎస్ తో పాటు మిగిలిన పశ్చిమ దేశాలు, యూరప్ దేశాలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతున్నాయి.

 తెరపైకి స్పేస్ ఎక్స్

తెరపైకి స్పేస్ ఎక్స్

రష్యాపై పశ్చిమదేశాలు విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశ ఆర్దిక వ్యవస్ధ కుప్పకూలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సహకారం అందించలేని పరిస్ధితులు ఎదురైతే అప్పుడు ఏం జరుగుతుందనే దానిపై ఆందోళన వ్యకమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో రష్యా హ్యాండిస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాము సహకారం అందిస్తామని ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్ధ ప్రకటించింది. ఇప్పటికే అంతరిక్షానికి టూరిజం ప్రమోట్ చేస్తున్న స్పేస్ ఎక్స్.. ఐఎస్ఎస్ విషయంలోనూ తమ సహకారం ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ ప్రైవేటు సంస్ధను నమ్ముకుని మిగతా దేశాలు ఐఎస్ఎస్ ను ఎంతకాలం నిర్వహిస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 అంతరిక్షంపై ఆధిపత్య పోరు ?

అంతరిక్షంపై ఆధిపత్య పోరు ?

భూమిపై అయితే దేశాలుగా పంచుకుని ఎక్కడికక్కడ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. అవసరమైతే పక్క దేశాలపై యుద్ధాలు చేసి ఆధిపత్యం సాధిస్తున్నాయి. కానీ అంతరిక్షంపై ఆ ఆటలేవీ చెల్లవు. ఇప్పటివరకైతే అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వాడుకోవాలనే పరస్పర ఒప్పందాలతో అందరూ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ దీనిపై సంపూర్ణ ఆధిపత్యం కాదు కదా ఓ మూలన కూడా ఆక్రమించుకోవడానికి కానీ ఆధిపత్యం సాగించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అంతరిక్షం భూమిలా చిన్నదేమీ కాదు. ఎవరి అంచనాలకు అందని విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిపై అందరూ ప్రయోగాల దశలోనే ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రష్యా ఉక్రెయిన్ పోరుతో తలెత్తిన పరిస్ధితులు ప్రపంచ దేశాల్ని ఆధిపత్య పోరు దిశగా నెడుతున్నాయి. గతంలో ఉమ్మడిగా పనిచేసేందుకు ఒప్పందం చేసుకున్న యూఎస్, బ్రిటన్, రష్యా ఇప్పుడు విడిపోతున్నాయి. కానీ పరస్పర సహకారం లేకుండా ఆధిపత్యం కాదు కదా.. కనీసం ప్రయోగాల విషయంలోనూ ముందడుగు వేయలేని పరిస్ధితులు నెలకొనేలా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+