ఉక్రెయిన్‌పై వార్ ఎఫెక్ట్ : రష్యాపై అమెరికా, ఈయూ ఆంక్షలు..! తీవ్ర పరిణామాలు తప్పవని పుతిన్ వార్నింగ్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను ఆగడం లేదు. భీకర దాడులకు దిగుతూ బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా భయానకపరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులను అమెరికాతోపాటు ఈయూ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అంతే కాదు. రష్యాకు మద్దతు ఇచ్చే దేశాలపై కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ప్రణాళికను సిద్దం చేస్తున్నాయి.

రష్యా, బెలరాస్‌లపై ఆంక్షలు
రష్యాతో పాటు దానికి మద్దతు ఇస్తున్న బెలరాస్‌లపై మరింత ఒత్తిడి పెంచేందుకు యురోపియన్ యూనియన్ దేశాలు సిద్ధమైయ్యాయి. మరిన్ని ఆంక్షలకు యూరోపియన్ కమిషన్ సిద్ధంచేసింది. రష్యా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో పాటు మూడు బెలారస్ బ్యాంకులపై ఆంక్షలకు విధించేందుకు రంగం సిద్దం చేసింది. రష్యాకు సముద్ర సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతులపై కూడా నిషేధం కూడా కొత్త ఆంక్షల జాబితాలో చేర్చింది.

స్పుత్నిక్, రష్యా టుడే ప్రసారాలపై వేటు
రష్యా ప్రసారాలపై కూడా యూరోపియన్ యూనియన్ వేటు వేసింది. ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక చర్యలపు ఫుల్ స్టాప్ పెట్టేవరకు తమ సభ్యదేశాల్లో స్పుత్నిక్, రష్యా టుడే ప్రసారాలను నిలివేస్తున్నట్లు ఈయూ ప్రకటించింది. తప్పుడు ప్రచారాలను కట్టిడికి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ మీడియా సంస్థలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశాలపై పక్షపాత ధోరణిలో వార్తలను ప్రచారం చేస్తున్నాయని .. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఈయూ పేర్కొంది.

3 భారత్‌పై ఆంక్షలు ? అత్యంత మూర్ఖత్వమే..
ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకిస్తోన్న దేశాలు.. రష్యాకు మద్దతిచ్చే దేశాలపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. బెలారప్‌పై ఆంక్షలు విధిస్తూ ఈయూ నిర్ణయం తీసుకున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి భారత్ మద్దతు ఇవ్వకపోయినా.. రష్యాకు తొలి నుంచి మిత్రదేశంగా వ్యవహరిస్తోంది. అయితే రష్యా నుంచి రక్షణ వ్యవస్థకు సంబంధిచిన యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి . ఇలాంటి చర్యలు ఉంటే మానుకోవాలని బెడెన్ ప్రభుత్వానికి అమెరికాలోని టాప్ రిపబ్లికన్ సెనెటర్ సూచించారు. భారత్‌పై ఆంక్షలు విధించాలంటే అది అత్యంత మూర్ఖత్వమే అవుతుందని హెచ్చిరించారు.
Recommended Video

ఈయూ, అమెరికాకు రష్యా వార్నింగ్
రష్యాపై ఈయూ, అమెరికా ఆంక్షలపై ఆదేశ అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. యూరప్ దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తాము కూడా ఆంక్షలను పెట్టాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే అని దుయ్యబట్టారు. జర్మనీకి తక్షణమే గ్యాస్ సరఫరా ఆపేస్తామని హెచ్చరించారు. ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తామని స్పష్టం చేశారు. రష్యా అన్నంత పనిచేస్తే అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఆకాశానంటుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరే అవకాశం ఉంది..












Click it and Unblock the Notifications