అవతార్ క్లైమాక్స్ ను మించి.. 620 డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా .. ఉక్రెయిన్ భూస్థాపితం..!

రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ విధ్వంస కరంగా మారుతోంది. తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. ఏకంగా 620 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టంచింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. రష్యా దాడులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు సాయం చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాడు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంది. వందలకొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ అట్టుడికి పోతోంది. తాజాగా మరోసారి 620 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టంచింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో రష్యాపై విరుచుకుపడ్డారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

Russia Unleashes 620 Drones and Missiles on Ukraine Zelenskyy Condemns Aggression

రష్యా దాడుల్లో ఖార్కివ్, సుమీ ప్రాంతాల నుంచి లీవివ్, బుకోవైనా ప్రాంతాల వరకు ధ్వంసం అయ్యాయి. 26 మిసైల్స్ 597 డ్రోన్ లతో రష్యా దాడులకు పాల్పడింది. అయితే ఉక్రెయిన్ సైన్యం 20 కు పైగా మిసైల్స్ ను ధ్వంసం చేసినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ సైన్యానికి థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో మారణహోమం సృష్టించింది రష్యా. గత మూడేళ్లలో ఇదే అతి పెద్ద దాడి. 8 రోజుల వ్యవధిలోనే మూడు భారీ ఎటాక్స్ చేసింది. అవి ఒకదానిని మించి మరొకటి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గత 8 రోజులుగా దాడులను ఉద్ధృతం చేసింది రష్యా. వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో మారణహోమం సృష్టిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ పై 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో రష్యా దాడి చేసింది. ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి.

ఉక్రెయిన్ పై దాడులపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో రష్యా మరింత దూకుడుగా ఉక్రెయిన్ పై రెచ్చిపోతోంది. వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+