russia versus ukraine : కీవ్ లో రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్-భీకర ఎదురుదాడి

ఉక్రెయిన్ పై దాడి మొదలుపెట్టి ఐదు రోజులవుతున్నా రష్యాకు మాత్రం రాజధాని కీవ్ పై ఇప్పటికీ పట్టు చిక్కడం లేదు. కీవ్ తో పాటు మరో కీలక నగరం ఖార్కివ్ ను చేజిక్కించుకున్నట్లు చెప్తున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అదుకు విరుద్ధంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ సైన్యం నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటనే.

దాదాపు మూడు మిలియన్ల జనాభా ఉన్నకీవ్ లో ప్రస్తుతం భీకర పోరు కొనసాగుతోంది. ఇక్కడ రాబోయే రోజుల్లో మరిన్ని పేలుళ్లు, ప్రాణనష్టం తప్పేలా లేదు. అయినా ఉక్రెయిన్ మాత్రం ఇక్కడ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ సాయుధ దళాలు రష్యా కాన్వాయ్ దూకుడును అడ్డుకునేందుకు శత్రు ట్యాంకుల పైకి ఎక్కడం వంటి విభిన్న పద్ధతులను వాడుతున్నాయి. దీంతో రష్యా కీవ్ ను ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేకపోయింది.

russia versus ukraine : attack intensified on kyiv as russian convoy gets closer

బెలారస్ సరిహద్దుల్లో నుంచి కీవ్ నగరానికి వెళ్లే మార్గంలో 40 మైళ్ల పొడవునా యుద్ధట్యాంకులు, ఇతర వాహనాలతో భారీ కాన్వాయ్ తెచ్చుకున్న రష్యా.. అక్కడి నుంచి ముందడుగు వేసేందుకు అపసోపాలు పడుతోంది. కీవ్ వైపుకు రష్యా కాన్వాయ్ నెమ్మదిగా కదులుతున్నట్లు తాజాగా శాటిలైట్ చిత్రాల్లో బయటపడింది. అంటే ఆ స్ధాయిలో ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలకు ప్రతిఘటన ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా కీవ్ కు 25 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాన్వాయ్ ఉన్నట్లు తాజా శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి.ఆహారం, ఇంధనం కొరతతో సహా ప్రాథమిక లాజిస్టిక్స్ సవాళ్లతో రష్యా బలగాలు పోరాడుతున్నందున కీవ్ పై రష్యా సైనిక చర్య నిలిచిపోయిందని యూఎస్ సీనియర్ రక్షణ అధికారి తాజాగా వెల్లడించారు.

Recommended Video

    Russia Ukraine Conflict : Russia పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు Ukraine ఫిర్యాదు | OneindiaTelugu

    కీవ్ లో ప్రవేశించేందుకు ఎదురవుతున్న ప్రతిఘటనతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో తాము ఉన్నచోటి నుంచే కీవ్ పై రష్యా బాంబులు ప్రయోగిస్తోంది. ఈ బాంబు దాడుల్లో కీవ్ ప్రధాన టీవీ టవర్, హోలోకాస్ట్ మెమోరియల్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. మరో ఐదుగురు గాయపడినట్లు ఉక్రేనియన్ అధికారులు తెలిపారు.పేలుడు కారణంగా కొద్దిసేపు టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి.టీవీ టవర్ సెంట్రల్ కీవ్ నుంచి కొన్ని మైళ్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉపయోగించే ప్రసార సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటామని రష్యా ప్రకటించిన తర్వాత ఈ బాంబు దాడి చోటు చేసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+