Russia VS Ukraine: రష్యా శాడిజం, పగ, ప్రతీకారంతో ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయుడు!
ఉక్రెయిన్/ చెన్నై: ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించి ఆదేశం మీద విరుచుకుపడిన రష్యా ఎంత పని చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఉక్రెయిన్ సైనికులు, ఆ దేశం ప్రభుత్వం మీద రష్యా పగ తీర్చుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు, ప్రైవేటు ఆస్తులు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల మీద దాడులు చేసిన రష్యా బలగాలు ఆ దేశంలో విధ్వంసం సృష్టించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహ ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు రష్యా తాత్కాలికంగా ఉక్రెయిన్ మీద కాల్పులు విరమించింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరునుల ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం వారిని భారత్ తరలిస్తోంది.
ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ లోని అమాయకులైన సామాన్య ప్రజల మీద రష్యా తన ప్రతాపం చూపిస్తోందని ప్రపంచ దేశాల్లోని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లిన తమిళనాడుకు చెందిన యువకుడు ఇప్పుడు రష్యా శాడిజం తట్టుకోలేక ఆ దేశం మీద పగ, ప్రతీకారంతో రగిలిపోయి ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు.
మూడు నాలుగు నెలల్లో చదువు పూర్తి చేసి భారత్ చేరుకోవలసిన తమిళనాడు యువకుడు ఇప్పుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యా మీద పోరాడటానికి సిద్దం అయ్యాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే భారత్ సైన్యంలో చేరాలని ఆ యువకుడు ప్రయత్నించాడని, అతని అర్జీని భారత సైన్యం తిరస్కరించిందని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

శాడిజం చూపిస్తున్న రష్యా
ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించి ఆదేశం మీద విరుచుకుపడిన రష్యా ఎంత పని చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఉక్రెయిన్ సైనికులు, ఆ దేశం ప్రభుత్వం మీద రష్యా పగ తీర్చుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ లోని సామాన్య ప్రజలు, ప్రైవేటు ఆస్తులు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల మీద దాడులు చేసిన రష్యా బలగాలు ఆ దేశంలో విధ్వంసం సృష్టించింది.

ఒత్తిడి పెరిగిపోవడంతో బ్రేక్ ఇచ్చిన రష్యా
భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహ ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు రష్యా తాత్కాలికంగా ఉక్రెయిన్ మీద కాల్పులు విరమించింది. ఇప్పటికే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరునుల ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం వారిని భారత్ తరలిస్తోంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ లోని అమాయకులైన సామాన్య ప్రజల మీద రష్యా తన ప్రతాపం చూపిస్తోందని ప్రపంచ దేశాల్లోని ప్రజలు మండిపడుతున్నారు.

చదువు కోవడానికి ఉక్రెయిన్ వెళ్లిన రవిచంద్రన్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన సాయినికేష్ రవిచంద్రన్ అలియాస్ సాయినికేష్ (21) ఉక్రెయిన్ దేశంలో నేషనల్ ఏరో స్పేస్ విశ్వవిద్యాలయంలో చదువు కోవడానికి 2018లో ఉక్రెయిన్ వెళ్లాడు. అప్పటి నుంచి సాయినికేష్ రవిచంద్రన్ ఉక్రెయిన్ లోనే చదువు కుంటున్నాడు. 2022 జులై నెలలో సాయినికేష్ రవిచంద్రన్ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారత్ చేరుకోవాలసి ఉంది.

వెయ్యి కళ్లతో ఎదురు చూసిన కుటుంబ సభ్యులు
మూడు నాలుగు నెలల్లో మా బిడ్డ ఇంటికి వచ్చేస్తాడని సాయినికేష్ రవిచంద్రన్ కుటుంబ సభ్యులు ఇంతకాలం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం ప్రకటించడంతో సాయినికేష్ రవిచంద్రన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు. కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులను భారతదేశానికి పిలుచుకుని రావడానికి అన్ని ప్రయత్నాలు చేసింది.

విదేశాంగ శాఖ ఎంట్రీతో?
ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేష్ లో భాగంగా సాయినికేష్ రవిచంద్రన్ భారత్ వస్తాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ లో ఉన్న సాయినికేష్ రవిచంద్రన్ కోయంబత్తూరులో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ లో కూడా చిక్కకుండా దూరం అయ్యాడు. కోయంబత్తూరులో ఉంటున్న సాయినికైష్ రవిచంద్రన్ కుటుంబ సభ్యులు భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రధించారు. భారత విదేశాంగా శాఖ అధికారులు కోయంబత్తూరు యువకుడు సాయినికేష్ రవిచంద్రన్ కోసం ఆరా తీశారు.

ఉక్రెయిన్ సైన్యంలో చేరిన యువకుడు
ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లిన తమిళనాడులోరి కోయంబత్తూరుకు చెందిన సాయినికేష్ రవిచంద్రన్ యువకుడు ఇప్పుడు రష్యా మీద రగిలిపోయి ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. మూడు నాలుగు నెలల్లో చదువు పూర్తి చేసి భారత్ చేరుకోవలసిన సాయినికేష్ రవిచంద్రన్ ఇప్పుడు ఉక్రెయిన్ పారామిలటరి సైన్యంలో చేరి రష్యా మీద పోరాడటానికి సిద్దం అయ్యాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

భారత సైన్యంలో చేరాలని ఆశపడ్డాడు
ఉక్రెయిన్ లో విద్యాభ్యాసం చేస్తున్న సాయినికేష్ రవిచంద్రన్ ఇప్పటికే భారత్ సైన్యంలో చేరాలని ప్రయత్నించాడని, అతని అర్జీని భారత సైన్యం తిరస్కరించిందని కోయంబత్తూరులోని అతని కుటుంబ సభ్యులు అంటున్నారని భారత విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. ఉక్రెయిన్ సైన్యంలో చేరిన సాయినికేష్ రవిచంద్రన్ ను ఎలాగైనా భారత్ పిలుచుకుని రావాలని అతని కుటుంబ సభ్యులు భారత విదేశాంగ శాఖ అధికారులను వేడుకుంటున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications