వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్ష కేంద్రంలో ... ఫైవ్‌స్టార్ హోటల్! ఉండొచ్చు.. తిరగొచ్చు.. సెల్ఫీలూ దిగొచ్చు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మాస్కో: పర్యాటకం ప్రపంచ సరిహద్దులు కూడా దాటేస్తోంది. ఏకంగా అంతరిక్షానికే విస్తరిస్తోంది. భూమికి అతి దగ్గరగా ఉండే మానవ నిర్మిత ఉపగ్రహానికి పర్యటాకులు చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్మించనున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ 'రాస్‌కాస్మోస్' ప్రకటించింది. దీని నిర్మాణానికి రూ.18 వేల కోట్ల నుంచి రూ.28 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొంది.

భూమికి అతి దగ్గరగా ఉండే మానవ నిర్మిత ఉపగ్రహానికి పర్యాటకులను అనుమతిస్తామని, వారు తమకు కేటాయించిన హోటల్‌ గదుల్లో నివసించడమే కాకుండా, ఉపగ్రహ ఉపరితలంపై తిరగవచ్చని, సెల్ఫీలు తీసుకోవచ్చని తెలిపింది.

Russia wants to build a five-star luxury HOTEL on the International Space Station by 2022

రెండేసి ఘనపు మీటర్ల పరిమాణంలో నాలుగు గదులుండే ఈ హోటల్‌ నుంచి భూగ్రహం అందాలను వీక్షించే సదుపాయాలుంటాయని, ఒకటి నుంచి రెండు వారాల పాటు ఈ హోటల్‌లో బస చేయవచ్చని పేర్కొంది.

అంతరిక్ష కేంద్రంలోని ఈ ఐదు నక్షత్రాల హోటల్‌‌లో ఉండాలనుకునే పర్యాటకుల నుంచి రూ. 256 కోట్ల మేర అద్దె వసూలు చేయనున్నట్లు. ఎవరైనా నెలరోజులు బస చేయాలనుకుంటే అదనంగా మరో రూ. 28 కోట్ల ఖర్చును భరించాల్సి ఉంటుందట.

English summary
Russia wants to welcome space tourists to the International Space Station (ISS) by 2022. The nation's space agency, Roscosmos, is currently reviewing plans for a five-star hotel onboard the space station. The 'luxury orbital suite' will feature four private cabins, measuring two cubic metres each, with personal portholes so tourists can look down on Earth. But a stay won't come cheap. Tourists will be charged £30 million ($40 million) per person for a one to two week visit.An extended month-long visit will set travelers back an additional $15 million ($20 million).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X