తాలిబన్లకు రష్యా షాక్- ప్రమాణ స్వీకారానికి రావట్లేదని సమాచారం- భారత్ తో చర్చల ఎఫెక్ట్ ?

ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే తాలిబన్లకు మిత్రదేశం రష్యా షాకిచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి రావాలని రష్యాతో పాటు చైనా, ఇరాన్, పాకిస్తాన్, తజికిస్దాన్ వంటి దేశాలకు తాలిబన్లు ఆహ్వానాలు పంపారు. కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని రష్యా నిర్ణయించింది.

తాలిబన్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి తాలిబన్లు ఆహ్వానించినా తాము మాత్రం వెళ్లకూడదని నిర్ణయించినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఓ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో తాలిబన్ల ఆహ్వానం తర్వాత వారిని తిరస్కరించిన తొలి మిత్రదేశంగా రష్యా నిలవబోతోంది. రాయబార స్ధాయి అధికారుల్ని మాత్రం ప్రభుత్వ ఏర్పాటు తర్వాత పంపాలని రష్యా భావిస్తున్నట్లు పార్లమెంటు ఎగువ సభ స్పీకర్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లకు రష్యా ఎప్పటినుంచో ఆపన్న హస్తం అందిస్తోంది. చాలా విషయాల్లో ఇప్పటికీ తాలిబన్లు రష్యాపై ఆదారపడుతుంటారు. అమెరికా అంటే గిట్టని తాలిబన్లు, వారికి కూడా ప్రత్యర్ధి అయిన రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే తాజాగా మారిన పరిస్ధితుల్లో బ్రిక్స్ దేశాల సదస్సుతో పాటు అంతకముందు భారత్ తో జరిపిన చర్చల్లో తాలిబన్ల కట్టడికి రష్యా అంగీకరించింది. ఆ తర్వాత ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా ప్రతినిధులు వెళితే అంతర్జాతీయంగా పరువు పోతుందని రష్యా భావించినట్లు తెలుస్తోంది.

Russia Wont Attend Talibans Government inauguration : says reports

భారత్ తో రష్యా జాతీయ భద్రతా సలహాదారు జరిపిన చర్చల్లో ఆప్ఘన్ లోపలే తాలిబన్లను పరిమితం చేసేందుకు ఓ అంగీకారం కుదిరింది. ఇస్లామీకరణ పేరుతో తాలిబన్లు ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తామని రష్యా భారత్ కు హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు కూడా హాజరుకావడం లేదని తెలిస్తోంది.

ఆప్ఘనిస్తాన్ వెళితే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని అధ్యక్షుడు పుతిన్ సహా ఇతర రష్యా నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తాలిబన్ల కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాలేమని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదేమైనా భారత్ తో చర్చల తర్వాత రష్యా తీసుకున్న స్టాండ్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు రాబోతోంది. తాలిబన్ల విషయంలో డృధవైఖరితో ఉన్న అమెరికాతో పాటు ఇతర దేశాలకూ ఇప్పుడు రష్యా నిర్ణయం ఆదర్శం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+