స్కూలుపై బాంబుల దాడి.. 29 మంది దుర్మరణం!
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో సంభవించిన అత్యంత దారుణమైన పోరాటానికి ముగింపు పలికేందుకు వచ్చేవారం అబుదాబిలో కీలక శాంతి చర్చలు జరగనున్న వేళ రష్యా దళాలు ఉక్రెయిన్ పై మరోసారి క్షిపణులు, బాంబులతో విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా జరిపిన ఈ దాడుల్లో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. అనేక భవనాలు శిథిలావస్థకు చేరాయి.
పాఠశాల నేలమట్టం.. 48 మంది గల్లంతు
జపోరిజియా ప్రాంతంలోని కొమషువాఖా గ్రామంలో బాధితులకు మానవతా సాయం అందించే పంపిణీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ పాఠశాల భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో భవనం నేలమట్టమై 29 మంది అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుకుపోగా.. 48 మంది ఆచూకీ లభించడం లేదని ప్రాంతీయ అధికారులు వెల్లడంచారు.

అలాగే ఖార్కివ్లోని ఓ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంపై రష్యా క్షిపణి పడటంతో రోగులతో సహా 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ ద్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించగా.. 20 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇంధన వనరులు, ఓడెసా పోర్టుల లక్ష్యంగా దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది.
అమెరికా ఎన్నికల వేళ రష్యా ఉగ్రరూపం: జెలెన్స్కీ
జర్మనీ ఛాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ తో అత్యవసర సమావేశం కోసం బెర్లిన్ చేరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న కీలక రోజునే రష్యా ఈ స్థాయిలో ఉగ్రరూపం దాల్చడం గమనార్హమని ఆయన అన్నారు. "రష్యా జరిపిన ఈ దాడుల సందేశాన్ని అమెరికా గుర్తించదని వారు భావిస్తున్నారు. కానీ ఇలాంటి వైమానిక ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు గమనించి తక్షణమే అడ్డుకోవాలి" అని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.
అబుదాబిలో శాంతి చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో నవంబర్ 10-11 తేదీల్లో యూఏఈ రాజధాని అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య రౌండ్ టేబుల్ శాంతి చర్చలు జరగనున్నాయి. యుద్ధం ముగింపు, యుద్ధానంతర భద్రతా ఏర్పాట్లు, సరిహద్దు నిరోధక చర్యలపై చర్చించనున్నట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. ఈ శాంతి సమావేశానికి ముందు రష్యా దాడులను ఉద్ధృతం చేయడం వెనుక ఉక్రెయిన్ను దౌత్యపరంగా ఒత్తిడికి గురిచేసే వ్యూహం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
What should be head-lining international news.On November 2, Russia hit a school being used for humanitarian purposes in Kamyshevakha killing 31 People, dozens are still missing.On November 3, Russia bombed a hospital injuring over 70 People. https://t.co/JDIUMIPBmB
— Wolf (@janetmjennifer) November 3, 2026














Click it and Unblock the Notifications
