ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. భారీగా ప్రాణనష్టం.. 2వేల మందికిపైగా మృతి
ఉక్రెయిన్‌పై రష్యా దళాలు భీకరంగా దాడులకు దిగాయి. భారీగా మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు ఖార్కీవ్‌పైనా రష్యా బలగాలు దాడులు కోనసాగిస్తున్నాయి. తాజాగా ఖార్కీవ్ లో జరిగిన దాడుల్లో 21 మంది మృతి చెందారు. 112 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

. రష్యా దాడి.. 2వేల మంది ఉక్రెయిన్ వాసులు మృతి
రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఎటు చూసినా శవాలు గుట్టు గుట్టులు దర్శనమిస్తున్నాయి. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. ఈ మేరకు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారికంగా వెల్లడించింది. మరోవైపు ఖర్కివ్ పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూ ప్రకటించారు. ఈ కర్ఫ్యూ దాదాపు 12 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

6వేల మంది రష్యా సైన్యం మృతి
...
మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు దీటుగానే ఎదుర్కొంటున్నాయి. గత ఆరు రోజుల్లో ఇప్పటివరకు 6 వేల మందికిపైగా రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యాను చావుదెబ్బ తీశామని పేర్కొన్నారు. తమ ఉక్రెయిన్ సైన్యంతో పాటు తమ పౌరులు కూడా రష్యా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు. రష్యా బాంబులు వేయడం ఆపితేనే చర్చలు సజావుగా సాగుతాయని జెలెన్ స్కీ స్ఫష్టం చేశారు.

పుతిన్ యుద్ధ నేరస్థుడు
అటు ఉక్రెయిన్ పై రష్యా తీరును ఐరోపా దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఆంక్షలను విధిస్తున్నాయి. తాజాగా రష్యాపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తగిన మూల్యం చెల్లించుకోవతప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications